శ్రియా శరణ్ భట్నాగర్ ఉత్తర భారతదేశంలోని హరిద్వార్ లో 11 సెప్టెంబర్ 1982న కాయస్థ కుటుంబంలో జన్మించింది. ఈమె ఢిల్లీలోని లేడీ శ్రీ రామ్ కాలేజీలో చదువుకుంది మరియు సాహిత్యంలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని అందుకుంది. శ్రియా 2018లో తన లోఖండ్‌వాలా నివాసంలో తన రష్యన్ ప్రియుడు ఆండ్రీ కొస్చీవ్‌ను వివాహం చేసుకుంది. వీరిద్దరికీ ఓ కుమార్తె పుట్టింది.
అయితే తాజాగా శ్రియా తన కూతురు రాధా శరణ్ కోస్చీవ్ బర్త్ డేను గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసింది. తన కూతురి బర్త్ డే పార్టీలో శ్రియా బికినీ వేసుకొని సందడి చేసింది. కూతురి బర్త్ డే కోసం మాల్దీవులకు వెళ్లి.. తన ఫ్యామిలీతో కలిసి శ్రియా సందడి చేసింది. అయితే అక్కడ బికినీ వేసుకొని దిగిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అందులో పెళ్లై పిల్లలున్నాప్పటికి శ్రీయ ఏ మాత్రం తగ్గకుండా.. బికినీ అందాలతో నెట్టింట మంటలు పుట్టిస్తుంది. ఆమె బికినీ అందాలను చూసి కుర్రాళ్లకు దిమ్మ తిరిగి పోయి సోషల్ మీడియాలో పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు. ఇక ఇప్పుడు అందాల భామ శ్రియా తెలుగులో ఆఫర్ల కోసం చూస్తున్నట్టుగా కనిపిస్తోంది.