నిధి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో కొన్ని సినిమాలలో నటించి తనదైన నటన, అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. నిధి అగర్వాల్ "మున్నా మైకేల్" సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా పరిచయమైంది. ఆ తర్వాత తెలుగులో నాగ చైతన్య సరసన "సవ్యసాచి" సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమాతో నిధి అగర్వాల్ కి పెద్దగా గుర్తింపు రాలేదు. అనంతరం మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్ వంటి సినిమాలలో నటించింది. ఇస్మార్ట్ శంకర్ సినిమా మంచి హిట్ అందుకోవడంతో నిధి అగర్వాల్ కి ఇండస్ట్రీలో ఇస్మార్ట్ బ్యూటీగా పేరు వచ్చింది.


దాంతో ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమాలో హీరోయిన్గా అవకాశం వచ్చింది. కరోనాకి ముందే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాని అనుకున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా నిధి అగర్వాల్ ని ఎంపిక చేశారు. ప్రస్తుతం నిధి అగర్వాల్ ది రాజా సాబ్ సినిమా కూడా చేస్తోంది. అయితే ఇది మాత్రమే కాకుండా నిధి అగర్వాల్ మరే ఇతర ప్రాజెక్టులకు సైన్ చేసినట్లు కనిపించడం లేదు.


కెరీర్ లో ఇంత పెద్ద గ్యాప్ రావడంతో నిధికి సినిమా అవకాశాలు పెద్దగా రావడం లేదు. తాజాగా ఈ అమ్మడు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో నిధి మాట్లాడుతూ.... నేను గ్యాప్ ఇవ్వలేదు గ్యాప్ వచ్చింది. ఫస్ట్ లాక్ డౌన్ కు ముందే హరిహర వీరమల్లు సినిమాను ఒప్పుకున్నాను. ఆ టైమ్ కి గ్యాప్ లేదు. కానీ ఈ సినిమా చేసే సమయంలో దాదాపు మూడున్నర నుంచి నాలుగు సంవత్సరాల సమయం పట్టింది. ఈ సినిమా పూర్తయ్యే వరకు ఏ ఇతర ప్రాజెక్టులకు ఒప్పుకోకూడదని నేను కాంట్రాక్టు మీద సంతకం చేశాను.


పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్ లో బిజీగా ఉండడం వల్ల ఆయన షూటింగ్ కి రావడం లేదు. షూటింగ్ కి డేట్స్ ఇచ్చినప్పుడు నేను కూడా అందుబాటులో తప్పకుండా ఉండాలని ప్రొడక్షన్ టీం కోరింది. అందుకే వేరే సినిమాలలో ఆఫర్స్ వచ్చినా నేను ఏ ఇతర సినిమాలకు ఒప్పుకోవడం లేదు అంటూ నిధి అగర్వాల్ చెప్పారు. షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత మరో లాక్ డౌన్ వచ్చింది. దానికి చాలా సమయం పట్టింది. ఇక్కడ ఎవరి తప్పు కూడా లేదంటూ నిధి అగర్వాల్ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: