టాలీవుడ్ హీరో బాలయ్య బాబు గురించి పరిచయం అనవసరం. బాలయ్యకు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. బాలయ్య బాబు వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఈ మధ్యకాలం ఆయన నటించిన సినిమాలన్ని హిట్ కొట్టి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగింది. అయితే బాలకృష్ణ ప్రస్తుతం దర్శకుడు బాబీ దర్శకత్వంలో డాకు మహారాజ్ సినిమాలో నటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమా సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగ వంశీ నిర్మిస్తున్నాడు. డాకు మహారాజ్ సినిమా థియేటర్ లో ఇటీవల విడుదల అయ్యింది.
ఇదిలా ఉండగా, తాజాగా స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ తన సినిమా ఎలా ఉందో అని తన ఫ్యాన్స్‌ని అడిగి తెలుసుకున్నారు.  స్వయంగా బాలకృష్ణ తన అభిమానులకు ఫోన్ కాల్ చేశారు. ఇక ఆయన కాల్ చేసి అభిమానులతో మాట్లాడిన ఆడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమా రెస్పాన్స్‌‌పై బాలయ్య బాబు కూడా చాలా సంతోషంగా ఉన్నారు.
ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో నటించిన వైష్ణవిగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ కూడా అందరి దగ్గరనుండి మార్కులు కొట్టేసింది. ఇక ఈ పాప ఎవరు ఏంటి అని సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ పాప సినిమా సెట్స్ లో బాలకృష్ణను పట్టుకుని ఏడుస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ బేబీ వైష్ణవి పేరు వేద అగర్వాల్. ఈ పాప నటి మాత్రమే కాదు, సింగర్ కూడా.. వేద ప్రముఖ గాయకుడు మాధవ్ అగర్వాల్ కూతురు. ఇటీవల తన కూతురు ఇంత పెద్ద సినిమాలో భాగం కావడంతో మాధవ్ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు. 'నేను ఆగ్రాలో పుట్టినా.. పెరిగిందంతా హైదరాబాద్లోనే! నా ఎనిమిదేళ్ల కూతురు తెలుగులో నటించిన పెద్ద సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నేను పెరిగిన హైదరాబాద్ లోని థియేటర్లలో ఆడుతోంది. ఎంత యాదృచ్చికం' అంటూ సంతోషంలో మునిగిపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: