హీరోయిన్ పూజ హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన నటన, అందం, క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ముఖ్యంగా అల్లు అర్జున్ హీరోగా నటించిన అల వైకుంఠపురం సినిమాలో హీరోయిన్ గా నటించి విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఈ సినిమాలో బుట్ట బొమ్మగా పూజ హెగ్డే మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ఈ సినిమా అనంతరం ఈ బ్యూటీకి వరుసగా సినిమా అవకాశాలు వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ వారి అంచనాలు తారుమారు అయ్యాయి. 


సినిమా అనంతరం పూజ హెగ్డేకు పెద్దగా సినిమా అవకాశాలు రాలేదు. ఏవో కొన్ని సినిమాలలో మాత్రమే హీరోయిన్గా చేసింది. ముఖ్యంగా తెలుగులో ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, రామ్ చరణ్, నాగచైతన్య వంటి స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. గత మూడేళ్ల నుంచి పూజా హెగ్డే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో మాత్రమే సినిమాలు చేస్తోంది. అక్కడ ఏవో కొన్ని సినిమాలు చేసుకుంటూ పోతోంది.

రోషన్ ఆండ్రుస్ దర్శకత్వం వహించిన "దేవా"లో ఈ బ్యూటీకి అవకాశం దక్కింది. ఇందులో షాహిద్ కపూర్ వంటి స్టార్ హీరో సరసన నటించే అవకాశాన్ని అందిపుచ్చుకుంది. కానీ ఇది కూడా ఈ బ్యూటీకి పెద్దగా కలిసి రావడంలేదని తెలుస్తోంది. ఇందులో షాహిద్ డామినేషన్ ముందు ఏది పెద్దగా కనిపించదట. ఇందులో ఇతర నటీనటులు ఎవరు కనిపించడం లేదు. అతడు రౌడీ పోలీస్ పాత్రలో నటిస్తున్నాడు. షాహిద్ గెటప్, డాన్స్, మాసిజం, యాక్షన్ ప్రతిదీ విజువల్ గా హైలెట్ కావడంతో పూజ హెగ్డే పెద్దగా హైలెట్ కావడం లేదు.


చూస్తుంటే ఈసారి కూడా ఈ బ్యూటీకి గుర్తింపు దక్కడం కష్టమని తెలిసిపోతోంది. ఇటీవల భాసద్ మచ్చ అనే పాటను రిలీజ్ చేశారు. దీనిలో షాహిద్ ఎనర్జిటిక్ స్టెప్పుల ముందు ఏది నిలబడదు. అతడు బేసిక్ గానే డాన్సర్ కావడంతో ఇతర పాత్రలు హైలైట్ గా కనిపించడం లేదు. పూజ పాత్రను పూర్తిగా హైడ్ చేసినట్లుగా తెలుస్తోంది. భారీ యాక్షన్ సినిమా దేవా విజయం సాధిస్తే అది పూజాకు మరో అవకాశం ఇస్తుంది. లేదంటే పూజకు ఇదే చిట్టచివరి అవకాశంగా భావించాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: