టాలీవుడ్ ఇండస్ట్రీ లో యూత్ ఆడియన్స్ బాగా ఇష్టపడే దర్శకులలో కార్తీక్ సుబ్బరాజ్ ఒకరు.2012 వ సంవత్సరంలో విడుదలైన పిజ్జా చిత్రంతో డైరెక్టర్ గా వెండితెరకు పరిచయం అయ్యాడు.ఆ సినిమా కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఈ డైరెక్టర్ కి మంచి పేరొచ్చింది.ఇదిలావుండగా సంక్రాంతి కానుకగా జనవరి 10 న థియేటర్స్ లోకి వచ్చిన రామ్ చరణ్ వన్ మాన్ షో మూవీ గేమ్ చేంజర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని దిల్ రాజు సుమారు 300 కోట్ల భారీ వ్యయంతో నిర్మించాడు.డ్యూయల్ రోల్ లో రామ్ చరణ్ ప్రదర్శించిన నటనకి ప్రతి ఒక్కరు జేజేలు పలుకుతున్నారు.ఇక తొలి రోజు 186 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని సాధించినట్టుగా చిత్ర బృందం ఒక పోస్టర్ రిలీజ్ చేస్తు అధికారంగా ప్రకటించింది. ఇక గేమ్ చేంజర్ తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ అందించిన కథతో తెరకెక్కిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో రీసెంట్ గా 'ఎక్స్' వేదికగా గేమ్ చేంజర్ పై స్పందిస్తు గేమ్ ఛేంజర్ వింటేజ్ శంకర్ గారి పొలిటికల్ పంచెస్ తో గ్రాండ్ గా మాస్ యాక్షన్ వైబ్స్ తో సూపర్ ఎంటర్టైనింగ్ గా ఉంది.

రామ్ చరణ్,ఎస్ జె సూర్యల పెర్ఫామెన్స్  అదిరిపోయింది. తిరు సినిమాటోగ్రఫీ కూడా ఎక్స్ లెంట్. ఇతర టీంకి కూడా శుభాకాంక్షలు.సినిమాలో నాకు కూడా చిన్న భాగం ఇచ్చినందుకు శంకర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నానంటూ 'ఎక్స్' వేదికగా తెలియచేసాడు.ఇప్పడు ఈ పోస్ట్ సినీ సర్కిల్స్ లో వైరల్ గా మారింది. శంకర్ కూడా  ధన్యవాదాలు అంటు రిప్లై  ఇవ్వడం జరిగింది. కార్తీక్ సుబ్బరాజ్ ప్రస్తుతం సూర్య తో మూవీ చేస్తున్నాడు.ఇక గేమ్ చేంజర్ లో చరణ్ తండ్రి కొడుకులుగా కనిపించగా,కియారా అద్వానీ,అంజలి హీరోయిన్లుగా చేసారు.ఎస్ జె సూర్య,శ్రీకాంత్, సముద్ర ఖని,సునీల్,రాజీవ్ కనకాల,జయరాం కీలక పాత్రలు పోషించారు.ఇదిలావుండగా డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ నిర్మాత దిల్ రాజు వద్ద నుండి తీసుకున్న రెమ్యూనరేషన్ అక్షరాలా పది కోట్ల రూపాయిలు. పాపం దిల్ రాజు ఈ సినిమా కోసం ఎంత భారీగా ఖర్చు చేశాడు అనడానికి నిదర్శనం ఇదే. ఫుల్ రన్ లో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అయ్యి హిట్ స్టేటస్ కి చేరుకోవాలంటే కచ్చితంగా 450 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రావాలి. అది ఈ సినిమాకి దాదాపుగా అసాధ్యం అనే చెప్పాలి. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే 300 కోట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: