నందమూరి నట సింహం బాలకృష్ణ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు . బాలకృష్ణ కు రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని ఏరియాల కంటే కూడా సీడెడ్ ఏరియా లో అద్భుతమైన క్రేజ్ ఉంటుంది . దానితో ఈయన నటించిన సినిమాలకు సీడెడ్ ఏరియాలో హిట్ , ఫ్లాపు టాక్ తో ఏ మాత్రం సంబంధం లేకుండా అద్భుతమైన కలెక్షన్లు వస్తూ ఉంటాయి . ఇక ఆయన నటించిన సినిమాకు మంచి టాక్ వచ్చినట్లయితే సీడెడ్ ఏరియాలో అదిరిపోయే రేంజ్ కలెక్షన్లు వస్తూ ఉంటాయి . ఈయన నటించిన అనేక సినిమా లు సీడెడ్ ఏరియాలో అద్భుతమైన కలెక్షన్ లను రాబడ్డాయి .

2023 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా బాలకృష్ణ హీరోగా రూపొందిన వీర సింహారె డ్డి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ మంచి అంచనాల నడుమ విడుదల అయ్యి అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసి సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు సీడెడ్ ఏరియాలో 6.55 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఇకపోతే తాజాగా బాలకృష్ణ "డాకు మహారాజ్" అనే సినిమాలో హీరో గా నటించాడు.

బాబి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను సీతార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ నిర్మించాడు. ఈ మూవీ ని నిన్న అనగా జనవరి 12 వ తేదీన సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేశారు. ఈ మూవీ కి మంచి పాజిటివ్ టాక్ జనాల నుండి వచ్చింది. దానితో ఈ మూవీ కి మొదటి రోజు సీడెడ్ ఏరియాలో మంచి కలెక్షన్లు వచ్చాయి. ఈ మూవీ కి మొదటి రోజు సీడెడ్ ఏరియాలో 5.25 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: