సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న సినిమాల్లో అవకాశాలు రావాలి అంటే హీరోయిన్లకి అందం , అభినయంతో పాటు ముఖ్యంగా విజయాలు కూడా ఉండాల్సిందే. విజయాలు ఎక్కువగా ఉన్న హీరోయిన్లకు ఎక్కువ శాతం క్రేజీ సినిమాల్లో అవకాశాలు దక్కుతూ ఉంటాయి. కానీ కొంత మంది విషయంలో మాత్రం ఇలా కాకుండా విజయాలు లేకపోయినా క్రేజీ సినిమాల్లో అవకాశాలు దక్కుతూ ఉంటాయి. అలాంటి వారిలో జాన్వి కపూర్ ఒకరు. ఈ ముద్దు గుమ్మ చాలా సంవత్సరాల క్రితమే హిందీ సినిమాల ద్వారా కెరీర్ ను మొదలు పెట్టింది.

బ్యూటీ ఇప్పటి వరకు చాలా హిందీ సినిమాలలో నటించింది. కానీ ఈమె నటించిన ఏ హిందీ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకోలేదు. చాలా వరకు ఈమె నటించిన సినిమాలు బాక్సా ఫీస్ దగ్గర కేవలం యావరేజ్ విజయాలను మాత్రమే అందుకున్నాయి. ఇకపోతే ఈమె కొంత కాలం క్రితం టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన దేవర పార్ట్ 1 సినిమాలో హీరోయిన్గా నటించింది. భారీ అంచనాల నడుమ విడుదల అయినా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని మాత్రమే అందుకోగలిగింది. ప్రస్తుతం జాన్వీ కపూర్ , మెగా పవర్ స్టార్  రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఆర్ సి 16 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది.

మూవీ భారీ పాన్ ఇండియా మూవీ గా రూపొందుతుంది. ఈమె దేవర పార్ట్ 2 లో కూడా హీరోయిన్గా కనిపించబోతుంది. ఇలా ఇప్పటివరకు ఈమెకు భారీ విజయాలు లేకపోయినా అద్భుతమైన క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలు మాత్రం ఫుల్ గా దక్కుతు వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే జాన్వి కపూర్ చాలా సినిమాల్లో తన నటనతో మరియు అందాలతో ప్రేక్షకులను కట్టిపడేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: