సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరియర్ చాలా తక్కువ సంవత్సరాలు ఉంటుంది అనేది చాలా వరకు వాస్తవం . ఎందుకు అంటే హీరోలతో పోల్చినట్లయితే హీరోయిన్ల కెరియర్ ఎక్కువ సంవత్సరాలు ఉండదు . దానితో కొంత మంది సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాక మంచి క్రేజ్ రాగానే వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ సంవత్సరానికి రెండు , మూడు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తూ మంచి జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తూ ఉంటారు . ఇకపోతే అలా స్పీడ్ గా కెరియర్ను కొనసాగిస్తున్న సమయంలో అపజయాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.

అలా ఎక్కువ శాతం అపజయాలు వచ్చినట్లయితే స్టార్ హీరోయిన్ క్రేజ్ వచ్చిన బ్యూటీలు ఎక్కువ సంవత్సరాల పాటు అద్భుతమైన జోష్లో కెరియర్ను కొనసాగించలేరు. ఇకపోతే కొంత మంది మాత్రం స్టార్ హీరోల స్థాయిలో కెరియర్ అద్భుతమైన రీతిలో ముందుకు సాగిస్తున్న బ్యూటీలు కూడా ఉన్నారు. ఆ ముద్దుగుమ్మలు మరెవరో కాదు త్రిష , నయనతార. ఇకపోతే త్రిష , నయనతార ఇద్దరు కూడా తమిళ సినిమాల ద్వారా కెరీర్ ను మొదలు పెట్టి అక్కడ మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత తెలుగు సినిమా పరిశ్రమ వైపు అడుగులు వేశారు. తెలుగులో కూడా స్టార్ హీరోయిన్ స్థాయికి వచ్చాక వీరిద్దరూ తెలుగు సినిమాలలో కంటే కూడా తమిళ సినిమాలలో నటించడానికి ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నారు.

ఇకపోతే కోలీవుడ్ ఇండస్ట్రీ లో వీరిద్దరికి అద్భుతమైన క్రేజ్ ఉంది. ఎంతో మంది ముద్దుగుమ్మలు తమిళ సినిమా పరిశ్రమ లోకి ఎంట్రీ ఇస్తున్న వీరు తీసుకునే రేంజ్ పారితోషకాన్ని మరే కోలీవుడ్ బ్యూటీ తీసుకోవడం లేదు అని తెలుస్తుంది. ఇప్పటికే ఈ ఇద్దరూ ముద్దుగుమ్మలు 40 సంవత్సరాలలోకి అడుగు పెట్టారు. అయిన కూడా తమిళ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్లుగా కెరియర్ను ముందుకు సాగిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: