తెలుగు సినిమా పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కరిగిన నిర్మాతలలో దిల్ రాజు ఒకరు. ఈయన తెలుగు సినీ పరిశ్రమలో మొదటగా డిస్ట్రిబ్యూటర్ గా కెరియర్ను మొదలు పెట్టి డిస్ట్రిబ్యూటర్ గా మంచి సక్సెస్ ను అందుకున్న తర్వాత నిర్మాతగా కెరియర్ ను ప్రారంభించాడు. అందులో భాగంగా దిల్ రాజు ఇప్పటి వరకు అనేక సినిమాలను నిర్మించి , అందులో చాలా మూవీలలో అద్భుతమైన విజయాలను అందుకుని చాలా సంవత్సరాలుగా సక్సెస్ ఫుల్ నిర్మాతగా తెలుగు సినిమా పరిశ్రమలో కెరియర్ను ముందుకు సాగిస్తున్నాడు. ఇకపోతే ఈయన తన కెరీర్లో ఎక్కువ శాతం కొత్త డైరెక్టర్లతో ఎక్కువ సినిమాలను రూపొందించి మంచి విజయాలను అందుకున్నాడు.

కానీ దిల్ రాజు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత స్టార్ డైరెక్టర్లుగా కెరియర్ కొనసాగించిన కొంత మంది దర్శకులతో మాత్రం ఈయన సినిమా చేయలేదు. ఇకపోతే కొంత కాలం క్రితం దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా అందులో భాగంగా ఆయనకు మీరు స్టార్ డైరెక్టర్లతో ఎందుకు సినిమాలు చేయలేదు అనే ప్రశ్న ఎదురయింది. దానికి ఆయన సమాధానం ఇస్తూ నేను స్టార్ డైరెక్టర్లతో సినిమా చేయాలి అని అనుకున్నాను. కానీ కుదరలేదు. కొన్ని సంవత్సరాల క్రితం నేను పూరి జగన్నాథ్ తో సినిమా చేయాలి అని ప్రయత్నాలు చేశాను.

కానీ కొన్ని కారణాల వల్ల పూరి జగన్నాథ్ తో సినిమా సెట్ కాలేదు. ఆ తర్వాత శ్రీను వైట్ల తో కూడా సినిమా చేయాలి అని ప్రయత్నాలు చేశాను. ఆయన కూడా అందుకు ఒకే చెప్పాడు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల శ్రీను వైట్ల తో కూడా సినిమా చేయలేకపోయాను అని అని దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు. ఇకపోతే ప్రస్తుతం కూడా దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్ గా , నిర్మాత గా అద్భుతమైన జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: