టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎవరో ఒకరు రోజుకొక వివాదం సృష్టించేలా చేస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో మరింత చర్చనీయాంశంగా మారుతోంది టాలీవుడ్. ఇటీవలే సీనియర్ హీరోయిన్ అన్షు పైన ప్రముఖ డైరెక్టర్ త్రినాధరావు నక్కిన చేసిన వ్యాఖ్యలు అనుచిత వ్యాఖ్యలు కావడంతో నిన్నటి రోజు నుంచి ఈ డైరెక్టర్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. త్రినాధరావు డైరెక్షన్లో మజాకా సినిమాలో ఈమె కీలకమైన పాత్రలో నటించింది. ఇందులో హీరోగా సందీప్ కిషన్ నటించగా హీరోయిన్గా రీతు వర్మ నటించినది. అలాగే రావు రమేష్ కూడా కీలకమైన పాత్రలో నటించారు.


మజాకా సినిమా ఫిబ్రవరి 21న రిలీజ్ కాబోతోంది. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఇటీవలే టీజర్ ని కూడా చిత్ర బృందం చాలా గ్రాండ్ గానే రిలీజ్ చేశారు ఈ సినిమా టీజర్ వేడుక చేయగా ఇందులో త్రినాధరావు మాట్లాడుతూ సినిమా కోసం ఎలా ఉండాలో చెప్పానో ఆమె అలా చేసిందంటూ అన్షు పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనిపైన చాలామంది మహిళా సంఘాలు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి డైరెక్టర్ త్రినాధరావు పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్లు చేస్తున్నారట.


దీంతో ఈ విషయంపై డైరెక్టర్ త్రినాధరావు మహిళలందరికీ క్షమాపణలు చెబుతూ ఒక వీడియోను కూడా విడుదల చేశారు.. ఈ వీడియోలో అందరికీ నమస్కారం ముఖ్యంగా మహిళలకి, అన్షు గారికి తన మాటల వల్ల ఎవరైనా ఆడవాళ్లు బాధపడ్డ వారందరికీ కూడా క్షమాపణలు తెలియజేస్తున్నానని తన ఉద్దేశం ఎవరిని ఇబ్బంది కలిగించడం కాదనీ ..తెలిసి చేసిన తెలియకుండా చేసిన అది తప్పు తప్పే అని మీరందరూ కూడా పెద్ద మనసుతో తన క్షమించాలి అంటూ వెల్లడించడం జరిగింది. అందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. మరి ఈ విషయంపై ఇప్పటికే మహిళా కమిషన్ కూడా నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: