సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి హైపు పెరగడానికి ముఖ్య కారణం గోదారి గట్టు సాంగు తో పాటు ట్రైలర్లో కామెడీ సన్నివేశాలు. ముఖ్యంగా వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ మధ్య సన్నివేశాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.కావలసినంత పబ్లిసిటీ ఈ సినిమాకి రావడం జరిగింది. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటూ ఈ చిత్రానికి సంబంధించి చిత్ర బృందం కూడా ప్రమోషన్స్ ని వేగవంతం చేసింది. దీంతో సంక్రాంతి వస్తున్నాం సినిమా థియేటర్లు బిజినెస్ కూడా బాగానే జరిగినట్లు తెలుస్తోంది. ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ మొత్తం రూ.41 కోట్లకు జరిగిందట.. ఈ సినిమా సక్సెస్ అవ్వాలి అంటే కనీసం రూ .45 కోట్ల రూపాయలు రాబట్టాలట.
సంక్రాంతికి వస్తున్నాను సినిమా క్రేజీ చూస్తే కచ్చితంగా 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ అయితే రాబట్టేలా ఉన్నది. ఇప్పటికే వెంకటేష్ కెరియర్ లో ఏ ఒక్క సినిమా కూడా రూ .100 కోట్లలో నిలిచిన సినిమా లేదని చెప్పవచ్చు. మరి ఈ సినిమాతో ఆ రికార్డును ఏమైనా బ్రేక్ చేస్తారా అంటూ అభిమానులు చాలా ఎక్సైటింగ్గా ఎదురుచూస్తున్నారు. సంక్రాంతికి ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమాగా ఇది ఉండబోతోంది. ఇందులో మరొకసారి వెంకటేష్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించారు. మరి ఏ మేరకు ఈ సినిమా కలెక్షన్స్ ని ఆకట్టుకుంటాయ చూడాలి మరి.