సంక్రాంతి వచ్చిందంటే చాలు  చాలామంది స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతూ పోటీ పడుతూ  ఉంటాయి. ఈసారి కూడా అలాగే జరిగిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇద్దరు సీనియర్ హీరోల సినిమాలు, ఒక యంగ్ హీరో సినిమా రిలీజ్ అయి సంక్రాంతి బరిలో. నిలిచి పోటీలో ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రాంచరణ్ హీరోగా చేసిన గేమ్ చేంజర్  మూవీ జనవరి 10వ తేదీన రిలీజ్ అయి  మిక్స్డ్ టాక్ తో దూసుకుపోతోంది. ఆ తర్వాత జనవరి 12వ తేదీన బాలకృష్ణ హీరోగా చేసిన డాకు మహారాజ్ రిలీజ్ అయింది. ఇదే తరుణంలో సంక్రాంతి రోజున వెంకటేష్ హీరోగా చేస్తున్న  సంక్రాంతికి వస్తున్నాం సినిమా రిలీజ్ అయింది. ఈ విధంగా మూడు సినిమాలు ఒకేసారి సంక్రాంతి బరిలోకి రావడంతో ఇందులో డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు మంచి టాక్ సొంతం చేసుకున్నాయి.

కానీ గేమ్ చేంజర్  సినిమాలను  బీట్ చేయలేకపోతోంది. ఈ క్రమంలోనే మెగా అభిమానులు కాస్త  నిరుత్సాహపడుతూ ఫైర్ అవుతున్నారు. గేమ్ చేంజర్  మూవీ సంక్రాంతి బరిలోకి వచ్చేది కాదు. ఈ సంక్రాంతికి మెగా హీరో చిరంజీవి విశ్వంభర సినిమా వస్తుందని అప్పట్లో ప్రకటించారు. అభిమానులు అదే నమ్మి ఆశగా ఎదురుచూస్తున్న తరుణంలో గేమ్ చేంజర్ మూవీ కోసం ఈ సినిమాను పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది. కానీ గేమ్ చేంజర్ మూవీ సంక్రాంతి బరిలో ఈ మిగతా సినిమాలకు పోటీ ఇవ్వలేకపోయిందని చెప్పవచ్చు.

 అదే చిరంజీవి సినిమా వచ్చి ఉంటే మాత్రం  వెంకటేష్ బాలకృష్ణకు అద్భుతమైన పోటీ ఉండేదని మా అన్నయ్య టాప్ లెవల్లో ఉండేవారని అనుకుంటున్నారు. గతంలో కూడా సంక్రాంతి సందర్భంగా బాలకృష్ణ, చిరంజీవి సినిమాల మధ్య విపరీతమైన పోటీ ఏర్పడింది. ఆ విధంగానే ఈసారి కూడా చిరంజీవి, బాలయ్య, వెంకటేష్ మధ్య పోటీ ఉండేదని, కొడుకు కోసం తండ్రి త్యాగం చేస్తే కొడుకు సినిమా వారి ముందు తేలిపోయిందని కొంతమంది అభిమానులు బాధపడుతున్నారు. కనీసం సంక్రాంతి సందర్భంగా విశ్వంభర సినిమా నుంచి చిన్న పోస్టర్ అయిన రిలీజ్ అయితే బాగుంటుందని అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: