హీరో కొడుకు పాత్రను దర్శకుడు అద్భుతంగా తీర్చిదిద్దారని సమాచారం అందుతోంది. ఈ పాత్ర కోసమే రిపీట్ ఆడియన్స్ థియేటర్లకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల విషయంలో అదరగొట్టడం పక్కా అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం మూవీ వెంకటేశ్ అభిమానులకు ఎంతగానో నచ్చేస్తుందని చెప్పవచ్చు.
అనిల్ రావిపూడి సినిమా స్టార్టింగ్ టు ఎండింగ్ తన మార్క్ టైమింగ్ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారని ఫ్యాన్స్ కు ఈ సినిమా ఎంతగానో నచ్చడం పక్కా అని తెలుస్తోంది. ఫ్యామిలీతో కలిసి ఈ సంక్రాంతికి సినిమా చూడాలని భావించే వాళ్లకు ఈ సినిమా బెస్ట్ మూవీ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని కచ్చితంగా చెప్పవచ్చు. సంక్రాంతికి వస్తున్నాం మూవీ కలెక్షన్ల విషయంలో సైతం అదరగొట్టే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు.
స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి భవిష్యత్తు సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాలని వెంకీ అనిల్ రావిపూడి కాంబినేషన్ రిపీట్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ ఏడాది సంక్రాంతి సినిమాలలో గేమ్ ఛేంజర్ మూవీ అంచనాలను అందుకోకపోయినా డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు మాత్రం ప్రేక్షకులను మెప్పించాయి. ఈ సినిమాలు కలెక్షన్ల విషయంలో సైతం అదరగొడుతున్నాయి. విక్టరీ వెంకటేశ్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా అంచనాలకు మించి రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.