విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన సంక్రాంతికి వస్తున్నాం అమెరికా ప్రీమియర్స్ కంప్లీట్ అయ్యాయి. ఈ నేపథ్యంలోఈ సంక్రాంతి లాస్ట్ బిగ్ మూవీ అయిన విక్టరీ వెంకటేష్ అనిల్ రావిపూడి ల కాంబోలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవ్వగా ముందుగా ప్రీమియర్స్ ను పూర్తి చేసుకున్న సినిమా కి ఫస్ట్ టాక్ వచ్చేసింది. విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం ఫస్ట్ టాక్ ఎలా ఉందో తెలుగు కుందాం పదండీ స్టోరీ పాయింట్ ని పూర్తిగా రివీల్ చేయడం లేదు కానీతన ఫ్యామిలీతో సంతోషంగా ఉంటున్న ఎక్స్ పోలిస్ అయిన హీరో లైఫ్ లోకి తన ఎక్స్ లవర్ ఒక కేసు ని సాల్వ్ చేయాల్సిన అవసరంతో వస్తుంది.వీళ్ళ గురించి తెలుసుకున్న హీరో భార్య కూడా ఈ మిషన్ లో చేరిన తర్వాత ఏం జరిగింది అన్నది ఓవరాల్ గా సినిమా స్టోరీ పాయింట్ కాగా ఇంకా సినిమాలో కొన్ని ఉప కథలు ఉండగా అవి సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.సినిమా స్టార్ట్ అవ్వడం సీరియస్ గా స్టార్ట్ హీరో హీరో ఫ్యామిలీ సీన్స్ తో లైట్ కామెడీ తో స్టార్ట్ అయిన సినిమా క్రమంగా కామెడీ డోస్ పెరుగుతూ పోగా కొంచం రెగ్యులర్ గా అనిపించినా కూడా కొన్ని చోట్ల కామెడీ హిలేరియస్ గా వర్కౌట్ అయ్యింది అని చెప్పాలి. స్టోరీ పరంగా కథ ఈజీగా గెస్ చేసేలానే ఉన్నప్పటికీ కూడా సిట్చువేషన్ కామెడీ బాగానే వర్కౌట్ అవుతూ ఇంటర్వెల్ ఎపిసోడ్ సెకెండ్ ఆఫ్ పై మంచి అంచనాలు పెంచగా సెకెండ్ ఆఫ్ కథ మళ్ళీ రొటీన్ గానే అనిపించినా ఎప్పటికప్పుడు కామెడీ సీన్స్ తో ఫ్యామిలీ ఎపిసోడ్స్ తో అలాగే డీసెంట్ సాంగ్స్ వలన సినిమా పెద్దగా ట్రాక్ తప్పలేదు అనిపించింది.

అలాగే బోర్ ఫీల్ కూడా కొంచం తక్కువగానే అనిపించడం విశేషం అని చెప్పాలి.మొత్తం మీద ఫస్టాఫ్ ఎబో యావరేజ్ లెవల్ లో అనిపించగా సెకెండ్ ఆఫ్ కొంచం పడుతూ లేస్తూ సాగినా కూడా ఓవరాల్ గా సెకెండ్ ఆఫ్ లో కూడా కొన్ని మంచి సీన్స్ పడటంతో సినిమా ఎండ్ అయ్యే టైంకి డీసెంట్ టు గుడ్ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ చూసిన ఫీలింగ్ ఆడియన్స్ కి కలగడం ఖాయమని చెప్పాలి.విక్టరీ వెంకటేష్ కామెడీ టైమింగ్ కొన్ని మంచి కామెడీ సీన్స్ ఓవరాల్ గా రొటీన్ స్టోరీని ఈజీగా ఒకసారి కూర్చుని చూసేలా చేసింది అని చెప్పొచ్చు. ఓవరాల్ గా సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రీమియర్ షోలను పూర్తి చేసుకున్న తర్వాత ఎబో యావరేజ్ కి తగ్గని టాక్ ను సొంతం చేసుకుంది. అలాగే ఈ చిత్రం యూఎస్ లో ప్రీమియర్ షో లు పడ్డాయి. సినిమాలో కామెడీ అదిరిపోయిందని, వెంకీ నటన ఎరగదీసారని పలువురు సోషల్ మీడియా పోస్ట్లు చేస్తున్నారు.ఇదిలావుండగా ప్రీమియర్స్ నుండే ఈ టాక్ అంటే ఇక రెగ్యులర్ షోలకు తెలుగు రాష్ట్రాల్లో ఫ్యామిలీ ఆడియన్స్ నుండి ఇంకా బెటర్ టాక్ కూడా సొంతం అయ్యే అవకాశం ఉన్న నేపధ్యంలో సినిమా చాలా వరకు అంచనాలను అయితే అందుకుందని చెప్పొచ్చు ప్రీమియర్స్ రిపోర్ట్ చూస్తుంటే ఇక రెగ్యులర్ షోలకు సినిమా కి ఎలాంటి టాక్ సొంతం అవుతుందో చూడాలి ఇప్పుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: