మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. 'మగధీర'తో ఒక్కసారిగా టాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు. ఆ సినిమాతో అతడి స్టార్ డమ్ అమాంతం పెరిగిపోయింది. ఆ తర్వాత వచ్చిన 'రచ్చ', 'నాయక్', 'ఎవడు', 'గోవిందుడు అందరివాడేలే' సినిమాలు యావరేజ్ టాక్ తెచ్చుకున్నా కూడా సూపర్ హిట్లుగా నిలిచాయంటే.. అది చరణ్ క్రేజ్ మహిమే అని చెప్పొచ్చు. కొంతమంది 'ఈ సినిమాలు ఎలా ఆడాయిరా బాబు' అనుకున్నా.. చరణ్ ఉన్నాడంతే, కలెక్షన్లు దుమ్ము దులిపేశాయి. కానీ, 'బ్రూస్ లీ - ది ఫైటర్' మాత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టినా.. అప్పటికీ 40 కోట్లు కొల్లగొట్టిందంటే మామూలు విషయం కాదు.

చరణ్ చేసింది తక్కువ సినిమాలే కానీ, టాలీవుడ్‌లో తిరుగులేని స్టార్ స్టేటస్‌ను సంపాదించుకున్నాడు. అందుకే కొంతమందికి అతనంటే కడుపు మంట. అప్పట్లో చరణ్ బాడీ షేప్ బాలేదని, యాక్టింగ్ రావట్లేదని పనిగట్టుకుని విమర్శించారు. కానీ, రామ్ చరణ్ మాత్రం తన పని తాను చేసుకుంటూ పోయాడు. 'రంగస్థలం' సినిమాతో నేషనల్ వైడ్‌గా ఫేమస్ అయ్యాక.. చరణ్‌ను విమర్శించిన వాళ్లంతా షాక్ అయ్యారు. నిన్న మొన్నటి వరకు నోటికొచ్చినట్టు మాట్లాడిన వాళ్లే.. ఈ సినిమా చూసి చరణ్‌ను ఆకాశానికెత్తేశారు.

ఇక ఆ తర్వాత వచ్చిన #RRR మూవీతో అయితే చరణ్ రేంజ్ మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేయడంతో.. రామ్ చరణ్ గ్లోబల్ స్టార్‌గా ఎదిగిపోయాడు. మధ్యలో తండ్రితో కలిసి చేసిన 'ఆచార్య' సినిమా ఫ్లాప్ అయినా.. అది చరణ్ కెరీర్‌పై పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. అయినా కానీ, కొందరు మాత్రం అతన్ని హేట్ చేస్తూనే ఉన్నారు. శంకర్ 'గేమ్ ఛేంజర్' సినిమా కోసం చరణ్ మూడేళ్లుగా కష్టపడ్డాడు. కానీ, ఈ సినిమా రిలీజ్‌కు ముందే అట్టర్ ఫ్లాప్ అంటూ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు. సినిమా బాగానే ఉన్నా.. కొంతమంది కావాలనే నెగెటివ్ ప్రచారం చేస్తున్నారు.

సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే ఈ నెగెటివ్ ప్రచారం మొదలుపెట్టారు. చివరికి ఆ ముద్ర వేసేలా చేశారు. ఓల్డ్ సినిమా విషయంలో కొందరు చేసినట్టుగానే.. గేమ్ ఛేంజర్ విషయంలోనూ చేస్తున్నారు. ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే.. పాన్ ఇండియా లెవెల్‌లో పుష్ప-2 రికార్డులను కూడా బ్రేక్ చేస్తుందని భయపడ్డారేమో. ఎంత నెగెటివ్ ప్రచారం చేసినా.. ఈ మూవీ ఇప్పటికే 200 కోట్ల మార్క్‌ను దాటేసింది. త్వరలో 1000 కోట్లు కొడితే.. ఇప్పుడు నోళ్లు తెరిచి విమర్శిస్తున్న వాళ్లంతా.. కర్చీఫ్‌లు అడ్డుపెట్టుకుని ఏడుస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: