పవన్ కళ్యాణ్, రేణుదేశాయ్ ల కొడుకు అకీరా నందన్ సినిమా ఇండస్ట్రీకి ఎప్పుడెప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే గతంలో అకీరా సినిమా ఇండస్ట్రీ ఎంట్రీ ఇస్తున్నాడు అంటూ ఎన్నో రకాల వార్తలు వినిపించాయి.ఆ వార్తలు అన్నీ కూడా అవాస్తవాలే అని కొట్టి పారేస్తూ వచ్చింది తల్లి రేణు దేశాయ్.అలాంటి వదంతులను నమ్మొద్దు అంటూ సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చింది.ఇది ఇలా ఉంటే తాజాగా రెండు మూడు రోజులుగా అకీరా నందన్ సినిమా ఇండస్ట్రీ గురించి ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి.ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజి సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ ఒక వార్త జోరుగా వినిపిస్తోంది.దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ చిత్రం ఓజి.పవన్ అభిమానులు ఐతే మొదట ఈ సినిమాకే ఎక్కువ ప్రిఫరెన్స్ కూడా ఇస్తున్నారు.ఇక ఈ పర్టిక్యులర్ సినిమాలో చాలా సర్ప్రైజ్ లు ఉన్నాయని టాక్ ఉంది.మరి వీటిలో పవన్ వారసుడు జూనియర్ పవర్ స్టార్ అకిరా నందన్ ఉన్నాడని ఆ మధ్య వచ్చిన బజ్ సోషల్ మీడియాని షేక్ చేసింది.

అయితే ఈ సినిమాలో అకిరా ఉన్నాడా లేదా అనే ప్రెజెన్స్ పై గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చెప్పే సమాధానం ఇపుడు ఆసక్తిగా మారింది.బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తోన్న అన్ స్టాపబుల్ టాక్ షోలో రామ్ చరణ్ అకీరా నందన్ సినిమా ఎంట్రీ పై హింట్ ఇచ్చాడు. త్వరలోనే ఓ భారీ బడ్జెట్ మూవీ సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెస్తోంది. . అలాగే అకిరానందంతో తనకు ఉన్న అనుబంధాన్ని రామ్ చరణ్ పంచుకున్నాడు. ఇతరులలో తన బాబాయ్ గొప్పదనం గురించి తలుపు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా రాంచరణ్ చేశారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ క్రమంలో ఇటీవల యాక్టర్ అండ డైరెక్టర్ SJ సూర్య కూడా అకీరా ఎంట్రీ పై స్పందించారు. అకిరా నందన్‌తో ఖుషి 2 ఏమైనా ప్లాన్ చేస్తారా? అని ప్రశ్నించగా.. తాను అకీరాను రాజమండ్రిలో కలిశాననీ, అతడిని ఫ్లైట్‌లో చూశాను. అద్భుతంగా అనిపించాడు. పవన్ కళ్యాణ్ గారి లాగానే.. అప్పుడే పుస్తకాలు పట్టుకుని చదువుతున్నాడు. ఒక వేళ ఛాన్స్ ఇస్తే.. టైం కలిసి వస్తే.. అకిరా నందన్‌తో ఖుషి సీక్వెల్ వర్కవుట్ చేస్తాననీ ఎస్‌జే సూర్య తెలిపారు.ఇక అకిరా ఎంట్రీ కోసం అటు రామ్ చరణ్ అభిమానులు ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: