ధమాకా, నేను లోకల్ వంటి సినిమాలకు డైరెక్టర్ గా చేసిన త్రినాధరావు నక్కిన తాజాగా వార్తల్లో నిలిచిన సంగతి మనకు తెలిసిందే.ఆయన దర్శకత్వం వహిస్తున్న మజాకా సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో ఒకప్పటి హీరోయిన్ అయినటువంటి మన్మధుడు నటి అన్షు అంబానీ పై అసభ్య కామెంట్లు చేయడంతో ఆయన మాటలు ఇండస్ట్రీ మొత్తం సంచలనం సృష్టించాయి. దాంతో చాలామంది ఆయనపై ఫైర్ అయ్యారు.ఇక నెటిజన్స్ అయితే తిట్టిన తిట్టు తిట్టకుండా సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టారు. అలాగే మహిళా కమిషన్ కూడా ఆయన మాటలపై ఫైర్ అయింది. దాంతో హీరోయిన్ కి సారీ చెప్పారు. అయితే ఈ విషయంపై తాజాగా సోషల్ ఆక్టివిటీస్ దేవి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ డైరెక్టర్ పై షాకింగ్ కామెంట్లు చేసింది. దేవి మాట్లాడుతూ.. కాలేజీ గోడ మీద కూర్చొని అమ్మాయిల్ని ఏడిపించే వాళ్లే నిర్మాతలుగా డైరెక్టర్లుగా మారుతున్నారు. 

వాళ్ళకి బాగా బలుపెక్కి,మదమెక్కి కొట్టుకుంటున్నారు. స్టేజ్ మీద నిల్చొని నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు.ఆ డైరెక్టర్ మాటలు ముమ్మాటికి తప్పే.. ఇలాంటి మాటలను కచ్చితంగా ఖండించి కఠిన చర్యలు తీసుకోవాలి. వాళ్లందరూ హీరోయిన్ ల శరీరాలను అమ్ముతూ ముక్కలు ముక్కలుగా రిటైల్ వ్యాపారానికి అమ్ముతూ డబ్బులు సంపాదిస్తున్నారు. మహిళల శరీరాలతో వ్యాపారం చేస్తూ వారిని కించపరుస్తున్నారు. ఈ విషయంపై ప్రభుత్వం హై పవర్ ఉన్న కమిటీ తీసుకువస్తే కానీ ఇలాంటివి  ఆగవు. గతంలో బాలకృష్ణ అమ్మాయిలకు కడుపులు చేయాలి అంటూ గోరంగా మాట్లాడారు. కానీ ఆ కేసులన్నీ అతీ గతీ లేకుండా ఎక్కడో మూలన పడ్డాయి. 

ఇండస్ట్రీలో ఉండే స్త్రీలపై దోపిడి జరుగుతుంది.. ఇలాంటి వారిని అదుపులో పెట్టడానికే అధికారం ఉంది.మరి అధికారంలో ఉన్న వాళ్లు ఏం చేస్తున్నారు.. పోలీస్ ఫోర్సు ఇలాంటి వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు.. ఇండస్ట్రీలో  నడుపుతున్నామంటే అందులో ఎన్నో నియమ నిబంధనలు ఉంటాయి. ఆమె చేయాల్సిన పని చేస్తుంది.శరీరాన్ని చూపించాల్సిన అవసరం ఏమి లేదు.ఇది శరీరం అమ్ముకోవాల్సిన ఇండస్ట్రీనా..మన తెలుగు వాళ్లకి దురహంకారం బాగా పెరిగిపోయింది.కేవలం హీరోలను మాత్రమే బాగా చూపిస్తారు.వారి వీరత్వాన్ని, కండ బలాన్ని చూపిస్తూ ఉంటారు. కానీ హీరోయిన్లకు కనీస గుర్తింపు ఉండదు. వారిని శరీరం చూపించే వస్తువుగానే ట్రీట్ చేస్తారు అంటూ సోషల్ ఆక్టివిటీస్ దేవి ఇండస్ట్రీపై ధమాకా డైరెక్టర్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: