ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆఖరుగా పుష్ప పార్ట్ 2 అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా పోయిన సంవత్సరం డిసెంబర్ 5 వ తేదీన విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ ఇప్పటికే భారీ కలక్షన్లను వసూలు చేసి ఎన్నో కొత్త కొత్త రికార్డులను నమోదు చేసింది. ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం డిసెంబర్ 5 వ తేదీన విడుదల అయిన ఈ సినిమాకు ఆ తర్వాత పెద్దగా ఇతర సినిమాలతో పోటీ ఏమీ రాలేదు.

దానితో ఈ మూవీ లాంగ్ రన్ లో కూడా అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసింది. ఇకపోతే ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా చాలా సినిమాలకు విడుదల కాపడంతో పుష్ప 2 కలెక్షన్స్ మొత్తం పడిపోతాయి అని చాలా మంది భావించారు. కానీ అలా జరగడం లేదు. ఇప్పటికే సంక్రాంతి పండుగ సందర్భంగా రామ్ చరణ్ హీరోగా రూపొందునంటే గేమ్ చేంజర్ , బాలయ్య హీరో గా రూపొందిన డాకు మహారాజ్ సినిమాలు విడుదల అయ్యాయి.

అలా తెలుగులో రెండు భారీ సినిమాలు విడుదల అయినా కూడా పుష్ప పార్ట్ 2 కలెక్షన్లు ఏ మాత్రం తగ్గడం లేదు. ఇది ఇలా ఉంటే బుక్ మై షో ఆప్ లో ఈ మూవీ కి అద్భుతమైన సేల్స్ కూడా జరుగుతున్నాయి. లాస్ట్ 24 గంటల్లో ఈ మూవీ.కి సంబంధించిన 18.69 కే టికెట్లు సేల్స్ జరిగినట్టు బుక్ మీ షో ఆప్ వారు అధికారికంగా ప్రకటించారు. ఇలా ఇప్పటికే కొత్త సినిమాలు చాలానే విడుదల అవుతున్నా కూడా పుష్ప పార్ట్ 2 క్రేజ్ మాత్రం అస్సలు తగ్గడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

aa