ఈసారి సంక్రాంతి రేసులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అదే విధంగా నందమూరి హీరో బాలయ్య అదే విధంగా విక్టరీ వెంకటేష్  ముగ్గురు నిల్చున్న  విషయం అందరికీ తెలిసిందే . రామ్ చరణ్ హీరోగా నటించిన 'గేమ్ చేంజఋ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీ థియేటర్స్ రిలీజ్ అయింది. ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ లభించింది . మరీ ముఖ్యంగా సినిమా పై నెగిటివ్ ట్రోలింగ్ ఎక్కువగా జరిగింది. ఆయన సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా లేదు అన్న కామెంట్స్ కూడా వినిపించాయి. సంక్రాంతి అంటే పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండాలి.


సంక్రాంతికి వచ్చే జనాలు అందరూ సినిమా కలిసి చూసే విధంగా ఉండాలి అంటూ అనుకుంటారు . ఆ విషయంలో రామ్ చరణ్ ఫెయిల్ అయ్యాడని అంటున్నారు జనాలు . ఇక డాకు మహారాజ్ . బాలయ్య మాస్ యాక్షన్ సీన్స్ సినిమాకి హైలైట్ గా మారాయి.  సినిమా పరంగా చూస్తే ది బెస్ట్ . కానీ సంక్రాంతి రేసులో డాకు మహారాజు నిలవడం అంత ఆకట్టుకోలేకపోయింది.  సినిమా కలెక్షన్స్ పరంగా  సూపర్ డూపర్ హిట్ . డాకుమహారాజ్ మాత్రం సంక్రాంతి రేసులో ..ఫ్యామిలీ టాక్ ప్రకారం సక్సెస్ కాలేక పోయింది అంటున్నారు . మరి ముఖ్యంగా ఫ్యామిలీ అంతా కలిసి వెళ్లి చూసి ఎంజాయ్ చేసే పాయింట్స్ ఈ సినిమాలో పెద్దగా లేవు అని.. ఫుల్ వైలెన్స్ యాక్షన్ సీన్స్ అంటూ చెప్పుకొస్తున్నారు .



ఇక ఈ సంక్రాంతికి పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ అయితే మాత్రం 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. వెంకటేష్ నటన .. అనిల్ రావిపూడి డైరెక్షన్ .. ఐశ్వర్య రాజేష్ పాత్ర ఈ సినిమాకి హైలైట్ గా మారాయి అని .. సంక్రాంతికి ఈ సినిమా థియేటర్స్ లో ఫ్యామిలీ అంతా కలిసి కూర్చుని చూసి ఎంజాయ్ చేయొచ్చు అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు . అంతేకాదు వెంకటేష్ ఫ్యామిలీ హీరోగా మెప్పించే క్వాలిటీ చాలా ఉంది అని .. ఈ సంక్రాంతికి పర్ఫెక్ట్ విన్నర్ వెంకటేష్ అంటూ 'సంక్రాంతి వస్తున్నాం' సినిమాను ఓ రేంజ్ లో ప్రశంసిస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: