పాపం తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలచింది అన్న రేంజ్ లో తయారైపోయింది ఇప్పుడు గ్లోబల్ హీరో రామ్ చరణ్ పరిస్థితి. ఆర్.ఆర్.ఆర్ సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న రాంచరణ్ ఆ తర్వాత నటించే సినిమాలు ఆయన కెరియర్ కు భారీ ప్లస్ అవుతాయి అని భావించాడు ఊహించాడు కూడా . కానీ ఏ సినిమా కూడా ఆయనకు గ్లోబల్ స్థాయి ఇమేజ్ ని ఇంక్రీజ్ చేయలేకపోయింది . కాగా ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత వచ్చిన 'ఆచార్య' ఆ తర్వాత వచ్చిన 'గేమ్ చేంజఋ.. రెండు కూడా మెగా ఫ్యాన్స్ ని నిరాశపరిచాయి .


అయితే 'ఆచార్య' సినిమాలో కేవలం రామ్ చరణ్ ది ఒక గెస్ట్ పాత్ర.  ఆ సినిమా ఫ్లాప్ అయిన పెద్దగా పట్టించుకోరు . కానీ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన 'గేమ్ చేంజఋ మాత్రం ఒక పెద్ద సినిమా . బడా పాన్ ఇండియా ప్రాజెక్ట్. మరి ఈ ప్రాజెక్టును ఇంత సింపుల్గా లాగేసాడు ఏంటి..? శంకర్ అంటూ చాలా ట్రోలింగ్ చేశారు . రామ్ చరణ్ గ్లోబల్ స్థాయి ఇమేజ్ కి ఈ మూవీ కాన్సెప్ట్ అసలు సెట్ అవ్వదు అంటూ కూడా మండిపడ్డారు . ఇదే క్రమంలో రాంచరణ్ సైతం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్త బాగా వైరల్ గా మారింది .



ఇకపై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్టోరీ చెప్పేటప్పుడు డైరెక్టర్ ఎలా చెబుతాడో.. తెరకెక్కించ్చేటప్పుడు కూడా అలాగే తెరకెక్కించాలి అంటూ ఒక కండిషన్ పెట్టబోతున్నాడట . దానికి కారణం శంకర్ కథ చెప్పినప్పుడు ఒకలా తెరకెక్కినప్పుడు మరొకలా చేశాడు అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపించడమే . రామ్ చరణ్ గేమ్  చేంజర్ విషయంలో ఎక్కువగా నెగ్లెక్ట్ గా బిహేవ్ చేశాడు అని ..ఆకారణంగా కూడా సినిమా నెగిటివ్ టాక్ దక్కించుకోవడానికి కారణమైంది అంటున్నారు. మరి ముఖ్యంగా ఫ్యాన్స్ పక్క హీరోల సినిమా రిలీజ్ అయినప్పుడు ఫ్లాప్ చేస్తాం ..వాళ్ళని తొక్కేస్తాం ఇలాంటి కామెంట్స్ రెచ్చగొట్టే విధంగా చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ డిసైడ్ అయ్యారట . మొత్తానికి రామ్ చరణ్ లో వచ్చిన మార్పు మంచిదే అంటున్నారు సినీ ప్రముఖులు..!

మరింత సమాచారం తెలుసుకోండి: