శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు. బీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించాడు. ఈ సినిమాలో ఫన్, ఫ్యామిలీ, డ్రామా, యాక్షన్, ఫాదర్ సెంటిమెంట్ వంటి అంశాలను కలగలిపి రూపొందించారు. మొదటి భాగం క్రేజీగా సాగిపోతే.... సెకండ్ హాఫ్ కొంత సాగదీసినట్లుగా అనిపిస్తుంది. క్లైమాక్స్ లో సీన్ల గురించి ఎక్కువ అంచనా వేసుకుంటే అభిమానులు కాస్త నిరాశ చెందినట్లుగా తెలుస్తోంది. కాకపోతే పూర్తి క్లీన్ ఎంటర్టైన్మెంట్ మూవీగా అభిమానులు ఫీల్ అయ్యే విధంగా ఈ సినిమా ఉంది.
సంక్రాంతికి కుటుంబం అంతా కలిసి చూసే కామెడీ ఎంటర్టైనర్ మూవీ. థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం సినిమా హాల్లోనే చూస్తే చాలా మంచి అనుభూతి కలుగుతుంది. కాగా, సంక్రాంతి వస్తున్నాం సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ శాటిలైట్ హక్కులను జీ గ్రూప్ సంస్థ దక్కించుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీంతో విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతి వస్తున్నాం సినిమా జి ఫైవ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
ఇది వరకే అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఫిబ్రవరిలో ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లుగా తెలుస్తోంది. దీంతో అభిమానులు ఈ సినిమా కోసం ఎప్పుడెప్పుడు ఓటీటీలో విడుదల అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమా థియేటర్లో పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. సంక్రాంతి సెలవులు ఉన్న కారణంగా ఈ సినిమాను థియేటర్లలో చూడడానికి అభిమానులు ఆసక్తిని చూపిస్తున్నారు.