సీనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో ఎన్నో గోప్ప‌ విజయాలు ఉన్న సంగతి తెలిసిందే . ఎలాంటి పాత్ర పోషించిన ఆ పాత్రల కు నూటికి నూరు శాతం న్యాయం చేసిన నటులలో సీనియర్ ఎన్టీఆర్ ఒకరు . విప్లవం యోధుడు అల్లూరి సీతారామరాజు కథ ను సినిమా గా నిర్మించాలని ఎన్టీఆర్ భావించారు . ఇక ఈయన తోడు దొంగలు సినిమా అనంతరం అల్లూరి సీతారామరాజు సినిమా లో నటించాల్సి ఉంది . కానీ అప్పటికే జయసింహ సినిమా ను ప్రకటించి ఉండడం తో ఎన్టీఆర్ నిర్ణయం మారింది .


ఇక జ‌య‌సింహ ఘ‌న‌ విజయం తర్వాత ఎన్టీఆర్ సీతారామరాజు పాత్ర లో సినిమా మొదలైనప్పటికీ .. అనేక కారణాల చేత ఈ సినిమా ఆగిపోయింది . ఇక పాండురంగ మహాత్మ్యం సినిమా తర్వాత ఈ సినిమా లో నటించాలని అనుకున్న ఎన్టీఆర్ .. ఇక ఆ సమయంలో పడాల రామారావు అల్లూరి సీతారామరాజు స్క్రిప్ట్ లో హీరోయిన్ కు స్థానం లేకపోవడం తో కథను మార్చాలని ఎన్టీఆర్  కోరారు . ఇక ఆ తర్వాత ఒక సంస్థ శోభన్ బాబు తో అల్లూరి సీతారామరాజు సినిమా ను తెరకెక్కించాలని అనుకున్నప్పటికీ ఆర్థిక సమస్యల కారణంగా వెనక్కి తగ్గింది .


అదే కథ ను సూపర్ స్టార్ కృష్ణ సొంతం చేసుకోగా త్రిపురనేని మహారథి తుది మార్పులు చేర్పులు చేశారు . ఇక సూపర్ స్టార్ కృష్ణ 100 వ సినిమా గా ఈ సినిమా తెరకెక్కడం ఆశ్చర్యం . ఇక కృష్ణ ఈ సినిమాలో నటించడం తో ఎన్టీఆర్ అల్లూరి సీతారామరాజు మూవీ విషయం లో వెనక్కి తగ్గారు . ఇక ఆ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ అల్లూరి పాత్ర లో నటించకపోయిన అప్పటికీ అనేక సినిమాలలో అల్లూరి పాత్ర లో కనిపించి ప్రేక్షకులని మెప్పించారు . ఇక ఈ వార్త చూసిన ప్రేక్షకులు..." ఎన్టీఆర్ గారికి ఈ సినిమా విషయం లో ఎక్కడలేని సమస్యలు ఈయనకే వచ్చినట్టు ఉన్నాయి గా.." అంటూ కామెంట్లు చేస్తున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: