ప్రభాస్ పేరు అన్న వినిపిస్తే చాలు దాని పక్కన కచ్చితంగా అనుష్క పేరు వినిపించాల్సిందే. అలాంటి ఒక క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు అనుష్క - ప్రభాస్ . వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అని చెబుతున్న ఎవరూ వినడం లేదు .రేపో మాపో పెళ్లి విషయం బయటపెడతారు అంటూ కూడా చాలామంది ఆశలు పెట్టుకున్నారు . కామన్ పీపుల్స్ ప్రభాస్ ఫ్యాన్స్ ఏ కాదు స్టార్స్ కూడా  అనుష్క - ప్రభాస్ ల  మధ్య ఏదో ఉంది అనే విధంగానే మాట్లాడుకున్నారు . అయితే రీసెంట్గా అన్ స్టాపబుల్ షోలో రామ్ చరణ్ - ప్రభాస్ పెళ్లి పై స్పందించారు .


ప్రభాస్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఊరు పేరు కూడా అనౌన్స్ చేశారు . దీంతో ఇక ప్రభాస్ - అనుష్కల పెళ్లి జరగనే జరగదు అంటూ ఫ్యాన్స్ డిసైడ్ అయిపోయారు. పోనీ ప్రభాస్ ఎవరైనా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అంటూ మాట్లాడుకుంటూ వచ్చారు .  మరో మూడు నెలల్లో ప్రభాస్ పెళ్లి అంటూ కూడా ప్రచారం జరిగింది. అయితే రీసెంట్ గా ప్రభాస్ పెళ్లి కొడుకు గెటప్ లో ఉన్న లుక్ వైరల్ గా మారింది.  ప్రభాస్ వరుస పాన్ ఇండియా  సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు .



కాగా ప్రభాస్ .. మారుతి కాంబోలో మూవీ నటిస్తున్నాడు. రాజా సాబ్ గా ఈ మూవీకి నామకరణం చేశారు . ఈ మూవీలో మాళవిక మోహన్ .. నిధి అగర్వాల్ ..రిద్ది కుమార్  హీరోయిన్లుగా నటిస్తూ ఉండడం అందరికీ ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. తమన్  సంగీతం ఈ సినిమాని వేరే లెవెల్ లో తీసుకెళ్లబోతుంది అంటూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్ . ఈ సినిమా టోటల్ హారర్ కామెడీ జోనర్ ల్లోనే తెరకెక్కబోతుంది . కాగా రీసెంట్గా సంక్రాంతి కానుకగా ఈ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మూవీ మేకర్స్ . ఆ పోస్టర్ లో ప్రభాస్ కళ్లద్దాలు పెట్టుకొని నవ్వుతూ పెళ్లి కొడుకుల కనిపించాడు . ఫోటో చూసి అచ్చం పెళ్ళికొడుకులా రెడీ అయ్యావు పెళ్లి కళ వచ్చేసింది అంటూ ఓ రేంజ్ లో ప్రభాస్ లుక్స్ వైరల్ చేస్తున్నారు . అంతేకాదు మనం ఎప్పుడు వస్తే అప్పుడే అసలైన పండుగ త్వరలోనే చితకొట్టేద్దాం అంటూ మూవీ టీం రాసుకొచ్చారు . ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది..!



మరింత సమాచారం తెలుసుకోండి: