సూపర్‌స్టార్ రజనీకాంత్  జైలర్ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రస్తుతం తన LCU నుండి వరుస బ్లాక్‌బస్టర్‌లతో అదరగొడుతున్న సంచలన దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో కింగ్ నాగార్జున ఓ కీలక పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే.ఇక కూలీ' సినిమాలో సైమన్‌గా కింగ్ నాగార్జున కనిపించనున్నారు. ఇదిలావుండగా ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన మరో హింట్ లీక్ అయింది. ఈ చిత్రాన్ని మే 1న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అందుకో కారణం ఉందంటున్నారు. కార్మికుల దినోత్సవం సందర్భంగా రిలీజ్ అవ్వడంతో? ఈ సినిమా మూల కథాంశం కార్మికులకు సంబంధించిందని కొత్త అంశం తెరపైకి వచ్చింది. 1960 కార్మికుల నేపథ్యంలో కొన్ని ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఉంటాయి. ఆ ప్లాష్ బ్యాక్ లో నాగార్జున పాత్ర చాలా బలంగా ఉంటుందిట.

నెవ్వర్ బిఫోర్ నాగార్జున తెరపైకి కనిపిస్తాడని అంటున్నారు. ఆ ప్లాష్ బ్యాక్ సన్నివేశాల్లోనే రజనీ-నాగ్ పాత్రలు నువ్వా? నేనా? అన్న రేంజ్ లో పోటాపోటీగా ఉంటాయిట. నాగార్జున పాత్ర ప్రజెంట్ సిచ్వెషన్ కు అన్వయిస్తూ ఆ పాత్రకు కొనసాగింపుగా ఉపేంద్ర తెరపైకి వస్తుందిట. ఇదంతా ప్రజెంట్ లో నడిచే కథ అని అంటున్నారు. అదే నిజమైతే ప్రజెంట్ స్టోరీలో నాగార్జున పాత్ర ఉండదని తెలుస్తోంది. మరి ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాలి.ఈ క్రమంలో కూలీ' విషయానికి వస్తే సూపర్ స్టార్ రజనీకాంత్‌కి ఇది 171వ మూవీ. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సత్యరాజ్, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర, శృతి హాసన్, మహేంద్రన్ వంటి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మరింత స్టార్ పవర్‌ను ఈ సినిమాకు జోడించడానికి, మేకర్స్ కింగ్ నాగార్జున ఓ ప్రత్యేక పాత్రకు సెలక్ట్ చేశారు. కింగ్ నాగార్జున (కింగ్ నాగార్జున) బర్త్‌డే స్పెషల్‌గా ఇటీవల ఆయన పాత్రను సైమన్‌గా పరిచయం చేశారు. నాగ్ ఫస్ట్ లుక్ మంచి స్పందన రాబట్టుకుంది. కళానిధి టాప్ మారన్ నిర్మాణం ఈ చిత్రం టెక్నీషియన్లు పని చేస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా 2025మే 1న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: