- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .


తెలుగు సిని పరిశ్రమ గర్వించదగ్గ దర్శకులలో సంగీతం శ్రీనివాసరావు ఒకరు. బాలయ్యతో.. ఆదిత్య 369 లాంటి క్లాసిక్ సినిమాను తెరకెక్కించిన ఘనత ఆయనది. ఆ రోజుల్లోనే ఆయన గొప్ప ప్రయోగాలు చేసేవారు. కమల్ హాసన్ - అమల ప్రధాన పాత్రలో నటించిన పుష్పక విమానం బాక్సాఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం పెద్ద ప్రదర్శనమే నడిచిందట. ఈ విషయాన్ని సింగీతం ఓ సందర్భంలో గుర్తుచేసుకున్నారు. కమలహాసన్ కు జోడిగా నీలం కొఠారి అనే ముంబై నటిని అనుకున్నారట. సింగీతం స్వయంగా వెళ్లి ఆమెను ఓకే చేశారు.


అయితే ఆమె తనతో పాటు హెయిర్ స్టైలిస్ట్, కాస్ట్ డిజైనర్లు కూడా వస్తారు అని చెప్పడంతో ఇది ఒక ప్రత్యేక చిత్రం.. సాధారణ సినిమాల‌లా కుదరదని ఆమెను రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత బాలీవుడ్ నిర్మాత రమేష్.. మాధురి దీక్షిత్ పేరు చెప్పారట. ఆమె నటించిన అన్ని సినిమాలు మధ్యలో ఆగిపోయాయి. ఆమె పెద్ద ఐరన్ లెగ్.. మీకు అలాంటి సెంటిమెంటు లేకపోతే ఆమెను వెళ్లి కలవమని చెప్పారట. మాధురి దీక్షిత్ పిఏని కలిస్తే.. మా హీరోయిన్ మాటలు లేని సినిమాలలో నటించదు అని చెప్పి వెనక్కు పంపారట.


ఆ తర్వాత ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్లు సంగీతంకు ఒక రోజు సన్మానం చేస్తుంటే.. అక్కడికి అమలు వచ్చారట.. ఆమె వివరాలు అడిగితే అంతకుముందు శివాజీ గణేషన్‌తో ఒక సినిమా చేసింది.. నటించడం సరిగా రాదని చెప్పారట. అయితే సింగీతంకు అమల పేస్ చూస్తే అలా అనిపించలేదు. చాలా నేచురల్ అనిపించిందట. చివరకు అలా అమలకు కథ చెప్పి ఆమెను పుష్పకవిమానం సినిమాలో హీరోయిన్గా తీసుకున్నారు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత సంగీతం.. మాధురి దీక్షిత్‌తో మరో సినిమా చేస్తున్నప్పుడు.. ఈ విషయం చెప్తే మంచి సినిమా మిస్ చేశాడు అంటూ తన పిఎపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారట.

మరింత సమాచారం తెలుసుకోండి: