( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .


రెండున్నర దశాబ్దాల క్రితం టాలీవుడ్‌లో చిన్న సినిమాగా వచ్చిన నువ్వే కావాలి సినిమా.. థియేటర్లను ఒక ఊపు ఊపేసింది. ఉషా కిరణ్ మూవీస్ బ్యాన‌ర్ పై అగ్ర నిర్మాత చెరుకూరి రామోజీరావు నిర్మించిన ఈ సినిమాకు కె. విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించారు. తరుణ్, సాయికిరణ్ హీరోలుగా .. రిచా హీరోయిన్గా తెరకెక్కిన ఈ ముక్కోణపు ప్రేమ కథలో.. పాటలు, ప్రేమ కథ అప్పటి కుర్ర కారును ఒక ఊపు ఊపేసింది.


కాలేజీలో చదివే వాళ్ళందరూ ఈ సినిమా చూసేందుకు ధియేటర్లకు పరుగులు పెట్టేవారు. అయితే ఈ సినిమా చాలా కేంద్రాలలో ఏకంగా ఏడాది పాటు ఆడింది. ఇలాంటి గొప్ప బ్లాక్ బస్టర్ సినిమాను ఒక టాలీవుడ్ హీరో రిజెక్ట్ చేసుకున్నారు. ఆ హీరో ఎవరో కాదు.. అక్కినేని మనవడు సుమంత్. సత్యం - గౌరీ - గోదావరి - గోల్కొండ హైస్కూల్ లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సుమంత్. నువ్వే కావాలి సినిమా ఆఫర్ ముందుగా సుమంత్ దగ్గరకు వచ్చిందట. సుమంత్ కెరీర్ అప్పుడప్పుడే మొదలవుతుంది. అదే టైంలో సుమంత్.. యువకుడు, పెళ్లి సంబంధం.. రెండు సినిమాలు ఒకేసారి చేస్తున్నాడు.


అందుకే నువ్వే కావాలి కి డేట్లు ఇవ్వలేకపోయానని .. నా కెరిర్‌లో అవకాశం వచ్చిన చేయలేకపోయిన మంచి సినిమా ఇది అని సుమంత్ ఓ సందర్భంలో వాపోయాడు. ఇక సుమంత్ కెరీర్ ఇప్ప‌ట‌కి ప‌డుతూ లేస్తూ ముందుకు సాగుతోంది. ఎంత బ‌ల‌మైన అక్కినేని ఫ్యామిలీ అండ ఉన్నా కూడా సుమంత్ హీరో గా నిల‌దొక్కు కోలేక‌పోయాడు. ఇక సుమంత్ వ్య‌క్తిగ‌త జీవితం కూడా సాఫీగా లేదు. హీరోయిన్ కీర్తిరెడ్డి ని ప్రేమ వివాహం చేసుకున్న సుమంత్ యేడాది కూడా కాక‌ముందే ఎప్పుడో విడాకులు కూడా ఇచ్చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: