- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .


మెగాస్టార్ చిరంజీవి గత మూడున్నర దశాబ్దాలుగా వరుస పెట్టి సినిమాలు చేస్తూ వస్తున్నారు. మధ్యలో ఆయన 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వెళ్లినప్పుడు.. సినిమాలకు విరామం ప్రకటించారు. . ఆ తర్వాత ఏడెనిమిది సంవత్సరాల పాటు చిరంజీవి సినిమాలుకు దూరంగా ఉన్నారు. తిరిగి 2017లో తన కెరీర్ 150వ సినిమా ఖైదీ నెంబర్ 150 తో వెండితెరపై రీ ఎంట్రీ ఇచ్చి సూపర్ సక్సెస్ కొట్టారు చిరంజీవి. తర్వాత ఖైదీ నెంబర్ 150 సినిమాతో పాటు. .. వాల్తేరు వీర‌య్య‌ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయితే ఆచార్య, భోళాశంకర్, సైరా లాంటి సినిమాలు మాత్రం అంచనాలు అందుకోలేదు. .


ప్రస్తుతం చిరంజీవి విశ్వంభ‌ర‌ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే వేసవి కానుకగా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఇదిలా ఉంటే.. చిరంజీవి కెరీర్‌లో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో.. . ఇంద్ర ఒక‌టి. 2002లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు బి.గోపాల్ దర్శకత్వం వహించారు. చిరంజీవికి జోడిగా అప్పట్లో టాలీవుడ్‌ను తన అందచందాలతో ఒక ఊపు ఊపేస్తున్న క్రేజీ హీరోయిన్ ఆర్తి అగర్వాల్‌తో పాటు.. మురారి సినిమాతో తెలుగు ప్రేక్షకులను మదిని దోచిన బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ సోనాలి బింద్రేని ఫైనల్ చేశారు. .


అయితే ఆర్తి అగర్వాల్ స్థానంలో సిమ్రాన్‌ను హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్నారు. అప్పటికే బి.గోపాల్, బాలయ్య కాంబినేషన్లో వచ్చిన సమరసింహారెడ్డి, నరసింహనాయుడు రెండు సినిమాలలోనూ సిమ్రాన్ హీరోయిన్.. బి.గోపాల్‌కు సిమ్రాన్ మంచి సెంటిమెంట్. అయితే చిరంజీవి మృగరాజు సినిమాలో సిమ్రాన్ నటించినా ఆ సినిమా డిజాస్టర్ అయింది. దీంతో సిమ్రాన్ కు బదులుగా.. మంచి ఫామ్ లో ఉండడంతో ఆర్తి అగర్వాల్‌ను హీరోయిన్గా తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: