- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .


టాలీవుడ్‌లో అగ్ర నిర్మాణ సంస్థలలో వైజయంతి మూవీస్ ఒకటి. చలసాని అశ్వినీదత్ .. వైజయంతి బ్యాన‌ర్‌ పై నాటి ఎన్టీఆర్ నుంచి.. నేడు ప్రభాస్ , మహేష్ బాబు , అల్లు అర్జున్ , జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోల వరకు అందరితోనూ సినిమాలు తీశారు. .మరీ ముఖ్యంగా వైజయంతి మూవీస్, చిరంజీవి కాంబినేషన్ అంటే మంచి క్రేజ్ ఉండేది. వీరిద్దరి కాంబినేషన్‌లో జగదేకవీరుడు అతిలోకసుందరి , చూడాలని ఉంది లాంటి.. రెండు సూపర్ డూపర్ హిట్ సినిమాలు తర్వాత .. ముచ్చటగా మూడో సినిమాగా 2002లో ఇంద్ర సినిమా వచ్చింది. .


బి.గోపాల్ ఈ సినిమాకు దర్శకుడు. అంత‌కు ముందు చిరుతో ఆయ‌న మెకానిక్ అల్లుడు సినిమా తెర‌కెక్కించారు. ఇంద్ర సినిమా అప్పటివరకు టాలీవుడ్ సినిమా చరిత్రలో ఉన్న ఎన్నో రికార్డులను తిరగరాసింది. ఈ సినిమాకు ఆ రోజుల్లోనే చిరంజీవి రెమ్యూనరేషన్ కాకుండా.. రూ.7 కోట్ల బడ్జెట్ అయింది. ఆ రోజుల్లో ఇది చాలా ఎక్కువ బడ్జెట్. ఈ సినిమా లాంగ్ ర‌న్‌లో 122 కేంద్రాలలో వంద రోజులు ఆడడంతో పాటు.. 50 కోట్లకు పైగా గ్రాస్ వ‌సూళ్ల ను సాధించింది.


రూ. 50 కోట్ల వసూళ్లు సాధించిన తొలి సినిమాగా ఇంద్ర రికార్డుల్లోకి ఎక్కింది. ఆ తర్వాత నాలుగేళ్లకు మహేష్ బాబు పోకిరి సినిమా ఈ రికార్డును బ్రేక్ చేసింది. మొత్తం 268 స్క్రీన్ లలో ఇంద్ర సినిమాని రిలీజ్ చేశారు. అత్యధిక థియేటర్లలో 50 రోజులు , 122 కేంద్రాలలో వంద రోజులు , పలు కేంద్రాలలో 175 రోజులు ఆడింది. విజయవాడలో ఇంద్ర 175 రోజుల ఫంక్షన్ చేశారు. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు దీనికి చీఫ్ గెస్ట్ గా వచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: