విక్టరీ వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అనే సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ లో తెరకెక్కిన ఎఫ్2, ఎఫ్3 సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించి సక్సెస్ సాధించింది. సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఫస్ట్ డే కలెక్షన్లు 15 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండే అవకాశం అయితే ఉంది. ఈ సినిమాకు బుకింగ్స్ మాత్రం అదిరిపోయే రేంజ్ లో ఉన్నాయి.
 
సంక్రాంతి పండుగకు సంక్రాంతి వస్తున్నాం మూవీ పర్ఫెక్ట్ మూవీ అని చెప్పవచ్చు. కలెక్షన్ల విషయంలో ఈ సినిమా అదరగొట్టే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. సంక్రాంతికి వస్తున్నాం మూవీ నిర్మాతగా దిల్ రాజుకు మంచి లాభాలను అందించడం పక్కా అని చెప్పవచ్చు. గేమ్ ఛేంజర్ తో నిరాశ చెందిన దిల్ రాజుకు సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఆ లోటు తీరినట్టేనని చెప్పవచ్చు.
 
సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఇతర రాష్ట్రాల్లో కూడా రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధించే ఛాన్స్ అయితే ఉంది. కొంతమంది యూట్యూబర్లు ఈ సినిమాకు 5 రేటింగ్ ఇచ్చారంటే ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగా మెప్పించేలా ఉందో అర్థం అవుతుంది. స్టార్ హీరోలు అనిల్ రావిపూడికి ఛాన్స్ ఇస్తే ఈ డైరెక్టర్ పాన్ ఇండియా స్థాయిలో కూడా ప్రూవ్ చేసుకోగలరు.
 
సంక్రాంతికి వస్తున్నాం సినిమా కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం పక్కా అని చెప్పవచ్చు. పెరిగిన టికెట్ రేట్లు ఈ సినిమాకు ప్లస్ కానున్నాయి. ఈ సినిమాకు లాంగ్ రన్ ఉండే అవకాశం అయితే ఉంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా సక్సెస్ ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరికి కూడా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ కు మిక్స్డ్ టాక్ వచ్చినా సినిమా మాత్రం ప్రేక్షకులను మెప్పించడం గమనార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి: