( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .


టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్‌లో ఇప్పటివరకు 28 సినిమాలలో నటించారు. మహేష్ బాబు కెరీర్ లో 28వ సినిమా గత సంక్రాంతికి వచ్చిన గుంటూరు కారం. మాటల మంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. మహేష్‌కి జోడిగా తొలిసారిగా శ్రీలీల‌ హీరోయిన్గా నటించింది. ప్రస్తుతం మహేష్ బాబు .. రాజమౌళి దర్శకత్వంలో తన కెరీర్ 29వ సినిమాలో నటిస్తున్నాడు. పాన్ వ‌ర‌ల్డ్‌ స్థాయిలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా 1000 కోట్ల భారీ బడ్జెట్లో తెరకెక్కుతోంది. .


దుర్గా బ్యానర్‌పై సీనియర్ నిర్మాత.. డాక్టర్ కే.ఎల్. నారాయణ ఈ సినిమాను నిర్మించమన్నారు. ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి.. ఈ సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఆఫ్రికా అడవులతో పాటు మధ్యభారతం - ఒరిస్సా అడవులలో లొకేషన్లు పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉంటే మహేష్ కెరీర్‌లో ఫస్ట్ ఇండస్ట్రీ హిట్ సినిమాగా నిలిచింది. పోకిరి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా 2006 ఏప్రిల్ 27న రిలీజ్ అయింది. పూరి జగన్నాథ్, మహేష్ బాబు కాంబినేషన్ అంటేనే తిరుగులేని క్రేజీ కాంబినేషన్.


వీరిద్దరి కాంబినేషన్‌లో పోకిరి - బిజినెస్ మ్యాన్ . . రెండు సినిమాలు వచ్చి రెండు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా పోకిరి అప్పట్లో వసూళ్లు పరంగా తెలుగు చిత్ర సీమలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. రూ. .10 కోట్ల బడ్జెట్ తో నే ఈ సినిమా ఆ రోజుల్లో రూ.72 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల తో పాటు రూ.40 కోట్లకు పైగా షేర్ సాధించి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. మహేష్ బాబు, పూరీల సినీ కెరీర్‌కు ఇంతటి అపురూప విజయం అందించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: