- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .


టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో తొలి బ్లాక్ బస్టర్ సినిమా ఒక్కడు. గుణశేఖర్ దర్శకత్వంలో. .  2003 సంక్రాంతి కానుక‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఒక్కడు .. మహేష్ బాబు కెరీర్‌ను ఒక్కసారిగా టర్న్ చేసింది . . .. . ఈ సినిమా అప్పట్లోనే 130 కేంద్రాల్లో వంద రోజులు ఆడింది. 100 కేంద్రాల్లో 100 రోజులు డైరెక్టుగా ఆడ‌గా ... సెకండ్ రిలీజ్ లో మ‌రో 30 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. . భూమిక హీరోయిన్గా నటించిన సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై.. ఎమ్మెస్ రాజు ఈ సినిమాను నిర్మించారు. ఒక్కడు తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో సూపర్ డూపర్ హిట్ కొట్టేందుకు మహేష్ ఏకంగా మూడేళ్లకు పైగా ఎదురుచూపులు చూడాల్సి వచ్చింది. .


మహేష్ ఎదురు చూపులకు తగ్గ ఫలితం 2006 లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన పోకిరి సినిమా ద్వారా వచ్చింది. ఈ సినిమా ఏకంగా ఇండస్ట్రీ హిట్ అయింది. మహేష్ బాబు , ఇలియానా జంటగా తెరకెక్కిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు. ఈ సినిమాకు ముందుగా పోకిరి టైటిల్ కు బదులుగా.. ఉత్తమ్‌ సింగ్ - సన్నాఫ్ సూర్యనారాయణ అనే టైటిల్స్‌ పరిశీలించారు. .


చివరకు అటు, ఇటు తిరిగి.. పోకిరి అనే టైటిల్ ఫిక్స్ అయింది. బాలకృష్ణ వీరభద్ర సినిమాకు పోటీగా ఒక రోజు ముందు రిలీజ్ అయిన పోకిరి.. కర్నూలు లాంటి చోట్ల ఏకంగా ఏడాది పాటు ఆడింది. మహేష్ బాబును తెలుగు సినిమా శిఖర భాగాన కూర్చోబెట్టింది. ఈ సినిమా దెబ్బతో పూరి జగన్నాథ్ తిరుగు లేకుండా కొన్నాళ్లపాటు ఇంకా చెప్పాలంటే.. ఇప్పటికీ అలా పాతుకు పోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: