ప్రస్తుతం సినిమా కల్చర్ మారిపోయింది . మూవీ చూసే తీరులో కూడా  మార్పు వచ్చింది . ఒకప్పుడు థియేటర్ కు సినిమా వచ్చిందంటే .. హిట్ టాక్ వినిపించేది . అలాగే 50 రోజులు , 100 రోజులు థియేటర్లలో ఆ సినిమా ఆడేది . కానీ ప్రస్తుత కాలం లో వారం రోజులు ఓ సినిమా థియేటర్ల లో ఆడడమే కష్టమైపోయింది . ఇక హిట్ టాక్ విషయాని కొస్తే నెల రోజులకు ఒకటి వినిపిస్తుంది . అయితే ఒక సినిమా మాత్రం ఏకం గా ఏడాది పాటు థియేటర్స్ లో రన్ అయింది .. అది కూడా ఒక పాట కోసమే హౌస్ ఫుల్ అయ్యింద ని ఎవరికైనా తెలుసా .


అదెలా సాధ్యం అనుకుంటున్నారా ? అవును ఇది సాధ్యమే. " చినుకు చినుకు అందెలతో " అనే పాట అందరూ చూసే ఉంటారు . ఈ పాట ఇప్పటికీ కూడా అందరిని ఆకట్టుకుంటుంది . ఈ సాంగ్ లో బాబు మోహన్ తో స్టార్ హీరోయిన్ సౌందర్య స్టెప్పులేసి అప్పట్లో అందరిని ఆకర్షించింది . అయితే గ‌తంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బాబు మోహన్ ఈ పాట గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు .


అయన మాట్లాడుతూ..." నేను థియేటర్ కు వెళ్ళినప్పుడు అక్కడ నాది , సౌందర్యాది కలిసి ఒక పెద్ద కటౌట్ చూసి ఆశ్చర్య పోయాను . దాని మీద 365 రోజులు అని రాసి ఉంది . అది చూసి ఆశ్చర్యం కలిగింది . ఆ క్షణం నా జన్మ ధన్యమైపోయింది . కేవలం " చినుకు చినుకు " అనే సాంగ్ కోసం హౌస్ ఫుల్ అయిపోయిందట . సాంగ్ టైం కు ప్రేక్షకులు రావడం ఆ పాట అయిపోయిన తర్వాత తిరిగి వెళ్లిపోవడం జరిగిందట . కేవలం ఆ ఒక్క పాట కోసం జనం ఎగబడ్డారు " అంటూ చెప్పుకొచ్చాడు బాబు మోహన్ . ప్రస్తుతం అయన చేసిన వ్యాఖ్యలు మ‌రోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి  .

మరింత సమాచారం తెలుసుకోండి: