" చిత్రం " సినిమా తో హీరో గా పరిచయమైన ఉదయ్ కిరణ్ .. అనంతరం " నువ్వు నేను " సినిమాతో పెద్ద ఎత్తున ప్యాన్‌ ఫాలోయింగ్ దక్కించుకున్నాడు . దీంతో థియేటర్స్ ముందు ఉదయ్ సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు క్యూ కట్టేవారు . ఒక విధంగా చెప్పాలంటే ఉదయ్ కిరణ్ సినిమా కి వస్తున్న ఓపెనింగ్స్ చూసి స్టార్ హీరోలు సైతం ఆశ్చర్యపోయేవారు . ఇక ఎం ఎస్ రాజు నిర్మాత గా విఎన్ ఆదిత్య దర్శకత్వం వహించిన మూవీ " మనసంతా నువ్వే ". ఈ సినిమా తోనే వి ఎన్ ఆదిత్య దర్శకుడు గా పరిచయమయ్యాడు .


సినిమా రిలీజ్ కి ముందు ఈ మూవీ పెద్ద హిట్ అవుతుందని అందరూ నమ్మారు . దీంతో ఈ మూవీ నిర్మాత ఎమ్మెస్ రాజు తన నెక్స్ట్ సినిమాను కూడా ఉదయ్ కిరణ్ తోనే చేస్తున్నారని అనౌన్స్ చేశాడు . అలా " నీ - స్నేహం " సినిమాకి పునాది పడింది . ఇక కథ మొత్తం తయారయ్యాక ఉదయ్ పక్కన హీరోయిన్గా ఎవరిని సెలెక్ట్ చేయాలని చిత్ర బృందం డిస్కషన్ పెట్టుకున్నారు . ఈ క్రమంలోనే కొందరు ఉదయ్ తో అప్పటికే హీరోయిన్గా నటించిన రీమా సేన్ నీ హీరోయిన్గా తీసుకుంటే హ్యాట్రిక్ హిట్ కొట్టొచ్చు అని సలహా ఇచ్చారు .


కానీ ఎం ఎస్ రాజు కి మాత్రం ఆల్రెడీ రెండు సినిమాలు కలిసి చేశారు కాబట్టి ఆడియన్స్ బోర్ ఫీల్ అవుతారని ఆర్తి అగర్వాల్ వైపు చూపు మళ్ళించాడు . అప్పటికే ఆర్తి అగర్వాల్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా నిలిచింది . మొదటి సినిమా కంటే ఆ తర్వాత సినిమాకి ఈ ముద్దుగుమ్మ బాగా స్లిమ్ గా తయారయింది . మంచి బొడ్డు , ఎద అందాలను బాగా చూపిస్తూ గ్లామర్ షోస్ చేసింది . దీంతో అవి చూసిన డైరెక్టర్ ఈమెకే హీరోయిన్గా ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించుకుని .. ఫైనల్ చేసేసాడు .

మరింత సమాచారం తెలుసుకోండి: