పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన చిత్రాలలో "ది రాజాసాబ్" సినిమా ఒకటి. ఈ సినిమాకు దర్శకుడు మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ ఇంతవరకు ఎప్పుడు కనిపించని విధంగా హర్రర్ కామెడీ జోనర్ లో నటించనున్నాడు. ఈ విషయం తెలిసి ప్రతి ఒక్కరూ ది రాజాసాబ్ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.


ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్లుగా రిద్ది కుమార్, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ నటించబోతున్నారు. ఈ ముగ్గురు హీరోయిన్లతో కలిసి ప్రభాస్ అభిమానులను అలరించనున్నాడు. ఈ ముగ్గురు హీరోయిన్లతో పాటు లేడీ సూపర్ స్టార్ నయనతార ఓ స్పెషల్ పాటలో చెప్పులు వేయనుంది. అంతేకాకుండా ది రాజాసాబ్ సినిమాలో నయనతార ఓ పవర్ఫుల్ పాత్రను పోషించనుందట. ఇక మారుతి దర్శకత్వంలో వస్తున్న ది రాజాసాబ్ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.


ఇక ప్రభాస్ కి "ఫౌజి" సినిమా షూటింగ్ సమయంలో కొన్ని గాయాలు అయ్యాయట. ఆ గాయాల కారణంగా ది రాజాసాబ్ సినిమా షూటింగ్ కాస్త లేట్ అవుతుందట. దానివల్ల ఈ సినిమా ఏప్రిల్ 10వ తేదీన రిలీజ్ కాకపోవచ్చనే వార్తలు సైతం వినిపిస్తున్నాయి. దీంతో ప్రభాస్ అభిమానులు కాస్త నిరాశ చెందుతున్నారు. ఇక మరికొందరు ఏమో కాస్త లేట్ అయినా పరవాలేదు సినిమా అద్భుతంగా ఉండాలంటూ ప్రబాస్ అభిమానులు అంటున్నారు.


కాగా, ఈ సినిమా నుంచి 2025లో ది రాజాసాబ్ సినిమా రిలీజ్ ఖచ్చితంగా అవుతుందని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా సమ్మర్ సెలవులలో రిలీజ్ అవుతుందని కొంతమంది అంటున్నారు. కాగా సంక్రాంతి కానుకగా ఈ సినిమా నుంచి ఓ క్రేజీ పోస్టర్ ను చిత్ర బృందం షేర్ చేసుకున్నారు. సంక్రాంతి కానుకగా అభిమానుల కోసం ఈ పోస్టర్ ను షేర్ చేశారు. ఇందులో ప్రభాస్ లుక్ చాలా బాగుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: