సాధారణంగా ఒక్కో స్టార్ హీరోకు ఒక్కో బలం ఉంటుంది. తమకు సూట్ అయ్యే కథలను హీరోలు ఎంచుకుంటే సులువుగా సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. సంక్రాంతికి వస్తున్నాం పర్ఫెక్ట్ వెంకటేశ్ మార్క్ సినిమా కాగా ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. కొన్నిచోట్ల ఫ్యామిలీలు ట్రాక్టర్లు, ఇతర వాహనాలను తీసుకుని సినిమా చూడటానికి వెళుతుండటం గమనార్హం.
 
విక్టరీ వెంకటేశ్ అభిమానులు ఇలాంటి కథలనే ఎంచుకో వెంకీమామ అంటూ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి తమ పాత్రలకు తమ వంతు న్యాయం చేసి సక్సెస్ ను సొంతం చేసుకున్నారు. ఫ్యామిలీ ప్రేక్షకులకు నచ్చేలా ఈ సినిమా తెరకెక్కింది. అనిల్ రావిపూడి ఈ సినిమాతో ఒక విధంగా సేఫ్ గేమ్ ఆడారని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అయితే అవసరం లేదు.
 
కొన్ని సన్నివేశాల్లో కామెడీ పేలకపోయినా అనిల్ రావిపూడి పరిమిత బడ్జెట్ లో బాక్సాఫీస్ వద్ద అద్భుతం చేశారనే చెప్పాలి. కొన్ని సీన్స్ లో లాజిక్ మిస్ అయినా ఎంటర్టైన్మెంట్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులను మెప్పించే విధంగా ఈ సినిమా ఉండటం గమనార్హం. ఐశ్వర్య రాజేష్ కు తెలుగులో మంచి ఆఫర్లు ఇస్తే ఆమె భవిష్యత్తులో మరిన్ని సినిమాలతో ప్రూవ్ చేసుకునే అవకాశం అయితే ఉంది.
 
బీజీఎం కొన్ని సీన్స్ లో బాగుండగా మరికొన్ని సీన్స్ లో మాత్రం ఆశించిన స్థాయిలో లేదు. సింపుల్ స్టోరీతోనే అనిల్ రావిపూడి బాక్సాఫీస్ వద్ద అద్భుతం చేశారు. సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఫుల్ రన్ లో ఏ రేంజ్ లో కలెక్షన్లను సాధిస్తుందో చూడాల్సి ఉంది. సంక్రాంతి సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవు. వెంకటేశ్ తర్వాత సినిమాలతో రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: