సంక్రాంతి అంటే ఇప్పుడే కాదు .. ఒకప్పటి నుంచి థియేటర్ల వద్ద సినిమాలు సందడి కనిపించేది . ముఖ్యంగా సంక్రాంతి కి పెద్ద హీరోలు పోటీ పడేవారు . సాధారణ సమయం లో కంటే సంక్రాంతి హిట్ లే ఎక్కువగా ఉంటాయి . ఇక ఇదే విధంగా 2001 సంక్రాంతి కి ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాయి . ఆ స్టార్ హీరోలు మరెవరో కాదు .. వెంకటేష్ , చిరంజీవి , బాలయ్య .


ఇక చిరంజీవి హీరోగా " మృగరాజు " సినిమా విడుదల కాగా.. ఈ సినిమాకి గుణ శేఖర్ దర్శకత్వం వహించాడు . ఇక ఈ సినిమా కోసం భారీ ఎత్తున ఖర్చు పెట్టారు మేకర్స్ . ఇక 2001 జనవరి 11న విడుదలైన ఈ సినిమా మెగాస్టార్ కెరీర్ లోని డిజాస్టర్ గా నిలిచింది . ఇక ఇదే రోజున బాలయ్య హీరోగా " నరసింహనాయుడు " సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ హీట్ ని అందుకుంది . ఈ సినిమాకు 30 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.


ఈ సినిమాలో బాలయ్య చెప్పిన " కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా " అనే డైలాగ్ ఇప్పటికి కూడా ట్రెండ్ అవుతూనే ఉంది . ఇక ఈ సినిమా 19 థియేటర్లలో 175 రోజులు ఆడి రికార్డులు క్రియేట్ చేసింది . ఇక ఇదే సంక్రాంతి కి హీరో వెంకటేష్ కూడా బరిలోకి దిగాడు. ఎమ్మెస్ రాజు నిర్మాణంలో వెంకటేష్ హీరోగా తెరకెక్కిన" దేవి పుత్రుడు " సినిమాను జనవరి 14 న విడుదల చేశారు . ఈ సినిమాలో భారీ గ్రాఫిక్స్‌ కారణంగా బడ్జెట్ కూడా ఎక్కువైందట . ఇక ఈ సినిమా కి ఏకంగా ఎంఎస్ రాజు కి 14 కోట్ల వ‌ర‌కు నష్టం వచ్చిందట . ఇక ఇలా 2001లో భారీ అంచనాల తో వచ్చిన చిరు , వెంకటేష్ లను .. కోల్కోలేని దెబ్బ కొట్టాడు బాలయ్య .

మరింత సమాచారం తెలుసుకోండి: