మెగా ఫ్యామిలీ మౌనంగా ఉంది . అసలు మెగా ఫ్యామిలీ ఏ విషయంలోనూ స్పందించడం లేదు . మాట్లాడటం లేదు . మరి ముఖ్యంగా పుష్ప2నే ఈ గొడవలకి కారణం అంటున్నారు జనాలు . అంతకుముందు వరకు కూడా మెగా ఫ్యామిలీ - అల్లు ఫ్యామిలీ చాలా చాలా హ్యాపీగా ఉండేది అని .. ఎప్పుడైతే పొలిటికల్ పరంగా చిక్కుల్లో ఇరుక్కున్నాడో.. అప్పటినుంచి అల్లు అర్జున్ కి ఇటు మెగా ఫ్యామిలీకి మధ్య సరిగ్గా పుసగడం లేదు అంటూ టాక్ అనిపిస్తుంది. పుష్ప 2 విషయంలో మెగా హీరోలందరూ మౌనం వహించారు . అసలు స్పందించలేదు .


అయితే పుష్ప2 సెన్సేషనల్ రికార్డ్స్ క్రియేట్ చేసింది . ఆఫ్ కోర్స్ కూసింత నెగిటివ్ ఇమేజ్ ని కూడా బన్ని ఖాతాలో వేసిన్నట్లైంది ఈ పుష్ప సినిమా.  అయితే ఇప్పుడు గేమ్ చేంజర్ విషయంలో ఫాన్స్ అనుకున్నదే నిజమైంది . గేమ్ చేంజర్ మూవీ పై అందరు నెగిటివ్ గా మాట్లాడుకుంటున్నారు. ఇంచుమించు ఫ్లాపే . కలెక్షన్స్ వచ్చాయి అంటున్నా కూడా అది ఎక్కడ అఫీషియల్ గా ప్రూవ్ అవ్వడం లేదు. అంతేకాకుండా పైరసీ కూడా గేమ్ చేంజర్ విషయంలో నెగిటివ్ గా మారిపోయింది .


అయినా సరే మెగా ఫ్యామిలీ నుంచి ఎవరు స్పందించడం లేదు . అటు పవన్ కళ్యాణ్ ఇటు చిరంజీవి ఏమి కూడా మాట్లాడకపోవడం అందరికీ ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది . అంతేకాదు 'మెగా మౌనం' ఇండస్ట్రీకి శాపంగా మారబోతుంది అని .. మెగా ఫ్యామిలీ ఇండస్ట్రీ నుంచి తప్పుకుంటే ఆ తర్వాత అసలు ఇండస్ట్రీలో పెద్ద సినిమాలు రావు అని .. తద్వారా చాలామంది కార్మికులు.. సినీ ప్రజలు నష్టపోయే పరిస్థితి వస్తుంది అని.. అందుకే మెగా ఫ్యామిలీ విషయంలో అందరూ కంట్రోల్ లో ఉంటే  మంచి అంటున్నారు అభిమానులు . మెగా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ అందరికీ తెలిసిందే . వేల కోట్ల ఆస్తి . సినిమాలు  చేయకపోయినా బతికిపోయే సత్తా ఉంది . అయితే కావాలని ఇలా పగబట్టి మెగా ఫ్యామిలీని రెచ్చగొడితే మాత్రం అది బౌన్స్ బ్యాక్ అవ్వడం ఖాయం అంటున్నారు మెగా అభిమానులు..!

మరింత సమాచారం తెలుసుకోండి: