టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బాల్యంలోనే పదికి పైగా సినిమాల్లో ప్రధాన పాత్రల్లో న‌టించాడు .. ఇక హీరో గా మారిన తర్వాత ఆయన నటించిన అన్ని సినిమాలు దాదాపు హిట్స్ గానే నిలిచాయి . ఇక తన సినీ కెరియర్లో మహేష్ బాబు వ‌దులుకున్న  చాలా సినిమాలు కూడా హిట్స్‌గా నిలిచాయి ఆ లిస్టులో ఉన్న సినిమాలు ఏంటో ఒకసారి ఇక్క‌డా చూద్దాం. మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోగా ఎంట్రీ ఇవ‌టానికి డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి మహేష్ బాబు ను యమలీల సినిమాకు అడిగార‌ట . ఈ విషయాన్ని కృష్ణతో చెప్పగా ఇంకా మహేష్ చిన్నవాడు ఇప్పుడిప్పుడే హీరోగా సినిమాలు వద్దు అంటూ చెప్పేసాడట కృష్ణ . అలా యమలీల సినిమా మహేష్ బాబుకు మిస్సయింది .


 ఇది సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక సమంత, నాగచైతన్యను స్టార్ కపుల్ గా మార్చిన మొదటి మూవీమాయ చేసావే. ఈ సినిమా దర్శకుడు గౌతమ్‌మీన‌న్ మొదట‌ ఈ సినిమాకు మహేష్ బాబును హీరోగా అనుకున్నాడట. కానీ కథ కూడా వినకుండానే మహేష్ ఈ సినిమాను రిజెక్ట్ చేశాడట. ఎమ్మెస్ రాజు తన నిర్మాణంలో వచ్చిన మనసంతా నువ్వే సినిమా కి కూడా మహేష్ బాబు ని అనుకున్నారట.. కానీ చివర్లో ఉదయ్ కిరణ్‌ను పెట్టి సినిమా రూపొందించాల్సి వచ్చింది. అలాగే రానా దగ్గుపాటి డబ్యూ మూవీ అయిన లీడర్, హీరో తరుణ్ ఇండస్ట్రీకి పరిచయమైన నువ్వే కావాలి సినిమాలు కూడా మొదట మహేష్ బాబు దగ్గరకు వెళ్లిన చాలా రోజులపాటు డెసిషన్ చెప్పకపోవడంతో ఈ సినిమాలు మహేష్ చేజారిపోయాయి.


ఇక లీడర్ సినిమాను ఎలాగూ ఒప్పుకోలేదు కదా అని ఫిదా సినిమా అయినా మహేష్ బాబు తోనే తీయాలి అనుకున్నాడట శేఖర్ కమ్ముల. ఆ సినిమాను కూడా మహేష్ రిజెక్ట్ చేశాడు. ఇక అల్లు అర్జున్ ను పాన్ ఇండియా స్టార్ గా నేషనల్ అవార్డు విన్నర్ గా నిలిపిన సినిమా పుష్పా కూడా సుకుమార్ మొదట మహేష్ బాబుకే వినిపించాడట.. కానీ మహేష్ ఈ సినిమా తనకు సరిపడదంటూ రిజెక్ట్ చేశాడు. రవితేజ నటించిన ఇడియట్ పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ అయినటువంటి జనగణమన కూడా మహేష్ రిజెక్ట్ సినిమాలే. సూర్య సూపర్ హిట్ మూవీ లైన గజినీ, 24 కూడా మహేష్ రిజెక్ట్ చేసినవే కావడం విశేషం. ఇవి మాత్రమే కాదు స్నేహితుడు, రుద్రమదేవి, మణిరత్నం లాంటి సినిమాలు సైతం మహేష్ బాబు చేయాల్సి ఉండగా అవి వర్కౌట్ కాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: