విక్టరీ వెంకటేష్ నటించిన తాజా చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో అద్భుతంగా నటించిన వెంకటేష్ ఈ సినిమాతో సంక్రాంతి కానుకగా అభిమానుల ముందుకు వచ్చారు. సైంధవ్ వంటి సూపర్ హిట్ సినిమాల అనంతరం వెంకటేష్ నటించిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో వెంకటేష్ సరసన హీరోయిన్లుగా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి నటించారు.


సినిమా విడుదలకు ముందే పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ద్వారా సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచారు. ఇదివరకే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం సంక్రాంతికి వస్తున్నాం సినిమాలోని పాటలు యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తున్నాయి. ఈ సినిమాలో వెంకటేష్ పాడిన బ్లాక్ బస్టర్ పొంగల్ పాట అద్భుతంగా ఉంది. ప్రమోషన్లలో సైతం వెంకటేష్, చిత్ర బృందం విభిన్న టాలెంట్లను చూపిస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు.


ఈ పండగకి కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తూ కడుపుబ్బా నవ్వుతూ చూసే సినిమా అని ఇటీవలే వెంకటేష్ వెల్లడించారు. శిరీష్ నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న అంటే ఈ రోజే థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే అమెరికాలో ఈ సినిమా ప్రీమియర్ షోస్ పూర్తయ్యాయి. ఇవాళ ఉదయం రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా విడుదలై పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. అభిమానులు కూడా ఈ సినిమాను చూడడానికి ఎంతో ఆసక్తిని చూపిస్తున్నారు. ఇదివరకే టికెట్లను సైతం బుకింగ్ చేసుకున్నారు.


కాగా, ఈ సినిమాలో మీనాక్షి చౌదరి వెంకటేష్ కి లవర్ పాత్రను పోషించగా ఐశ్వర్య రాజేష్ భార్యగా నటించింది. వీరిద్దరి నటన ఈ సినిమాకే హైలైట్ గా నిలిచింది. ఈ క్రమంలోనే వీరిద్దరిలో ఎవరి నటన అద్భుతంగా ఉందనే వార్తలు తెరపైకి వస్తున్నాయి. కొంతమంది ఐశ్వర్య రాజేష్ అమాయకంగా అద్భుతంగా నటించిందని అంటుంటే మరి కొంతమంది మీనాక్షి చౌదరి నటన సినిమాకే హైలైట్ గా నిలిచిందని మరికొందరు అంటున్నారు. ఏది ఏమైనప్పటికి ఈ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ పొంగల్ అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: