తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద యాక్టర్ జయం రవి. ఆయన యంగ్ ఆడియన్స్ నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ వరకు అందరిలో మంచి పేరు తెచ్చుకున్నాడు. అతని సినిమాల్లో చాలా వరకు హిట్ అయిన తెలుగు సినిమాల రీమేకిలే కావడం విశేషం. రవి తమిళ ఇండస్ట్రీలోకి 'జయం' సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఇది కూడా తెలుగులో సూపర్ హిట్ అయిన అదే పేరుతో వచ్చిన సినిమాకి రీమేక్. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.

అప్పటినుంచి అందరూ ఆయన్ని జయం రవి అనే పిలవడం మొదలుపెట్టారు. కానీ రీసెంట్‌గా సంక్రాంతి పండుగ టైమ్‌లో రవి తన ఫ్యాన్స్‌కి ఒక షాకింగ్ న్యూస్ చెప్పాడు. తనని ఇకపై జయం రవి అని పిలవద్దంటూ అందరినీ కోరుతూ ఒక లెటర్ రిలీజ్ చేశాడు. తన అసలు పేరు రవి మోహన్ తో పిలవాలని చెప్పాడు. జయం రవి అనేది తన ప్రొఫెషనల్ పేరు మాత్రమే అని, ఇకపై ఆ పేరు వాడాలని అనుకోవట్లేదని అన్నాడు. అంతేకాదు, త్వరలోనే ఇదే పేరుతో ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేసి సేవ కార్యక్రమాలు కూడా చేస్తానని చెప్పాడు. ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఇంతకీ రవి పేరు మార్చుకోవడానికి కారణం ఏంటా అని ఫ్యాన్స్ తెగ ఆలోచిస్తున్నారు. కొందరైతే రవి బాగా జ్యోతిష్యాన్ని, సంఖ్యా శాస్త్రాన్ని నమ్ముతాడని అందుకే జ్యోతిష్యుల సలహా మేరకే ఈ నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు. ఇంకొందరైతే గూగుల్‌లో జయం రవి అని సెర్చ్ చేస్తే తన విడాకుల గురించిన వార్తలు ఎక్కువగా వస్తుండటంతో ఆయన కాస్త ఇబ్బంది పడుతున్నాడని అంటున్నారు.

రవి ఎడిటర్ మోహన్ కొడుకు, డైరెక్టర్ మోహన్ రాజా తమ్ముడు. ఆయన అన్నయ్య మోహన్ రాజా తెలుగులో చిరంజీవితో 'గాడ్ ఫాదర్' లాంటి చాలా సూపర్ హిట్ సినిమాలు తీశాడు. అంతేకాదు రవితో 'తని ఒరువన్' సినిమా తీసింది కూడా ఆయనే. ఆ సినిమాని తెలుగులో రామ్ చరణ్‌తో 'ధృవ'గా రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: