టాలీవుడ్‌ స్టార్‌, విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాలలో నటించి ఫ్యామిలీ ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్విస్తాడు. ముఖ్యంగా వెంకటేష్ సినిమా అంటే ఫ్యామిలీ అంతా కలిసి చూసే విధంగా ఉంటుంది. ఈ క్రమంలోనే వెంకటేష్ తాజాగా నటించిన చిత్రం "సంక్రాంతికి వస్తున్నాం". ఈ సినిమా జనవరి 14న అంటే ఈరోజున థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ విడుదల అయింది.


ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాపై అభిమానులు ఎన్నో ఆశలను పెట్టుకున్నారు. ఈ సంక్రాంతికి ఈ సినిమా చాలా స్పెషల్ అని చెప్పవచ్చు. సంక్రాంతి కల్చర్ లో సినిమా కుటుంబం అంతా కలిసి చూసే విధంగా ఉంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కి వెంకీ మామ అంటే చాలా ఇష్టం. ఈ సినిమా కంప్లీట్ ఫెస్టివల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని ప్రతి థియేటర్ నుంచి టాక్ గట్టిగా వినిపిస్తోంది.


బుల్లి రాజు పాత్రలో వెంకటేష్ ఆకట్టుకున్నారు. ప్రత్యేకంగా మ్యూజిక్ సినిమా ను ఎలివేట్ చేసిందని సమాచారం. ఇక క్రాఫ్ట్ పరంగా చూసుకుంటే సినిమా డీసెంట్ గానే ఉందని అంటున్నారు. మరోవైపు దర్శకుడు తన రొటీన్ కామెడీ ట్రాక్ ను మరోసారి అప్లై చేసినట్లుగా తెలుస్తోంది. అయితే "సంక్రాంతికి వస్తున్నాం". సినిమాలో కామెడీ చాలా అద్భుతంగా ఉందట.


అయితే కొన్ని సన్నివేశాలలో మాత్రం కామెడీ కాస్త బెడిసి కొట్టిందట. బలవంతంగా టాలీవుడ్‌ స్టార్‌, విక్టరీ  వెంకటేష్ తో కామెడీ చేయించే ప్రయత్నం చేశారట. ఆ సీన్లు ప్రేక్షకులకు పెద్దగా నచ్చలేదట. వెంకటేష్ బలవంతంగా కామెడీ చేసినట్లుగా ఈజీగా తెలుస్తుందట. ఈ కామెడీ సీన్లు సినిమాకే మైనస్ గా మారుతున్నాయని సమాచారం అందుతోంది. ఏది ఏమైనప్పటికి ఈ సినిమా అభిమానులకు విపరీతంగా నచ్చుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: