గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ - కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన గేమ్ చేంజర్ సినిమా ఎన్నో అంచనాల నడుమ విడుదలైంది. ఈ సినిమాలో రామ్ చరణ్ హీరోగా నటించగా కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటించారు. సునీల్, శ్రీకాంత్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఈ సినిమాకు ప్రొడ్యూసర్ దిల్ రాజు, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై రూ. 450 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ రేంజ్ లో జరిగింది.


ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన గేమ్ చేంజర్ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. సినిమా స్టోరీ డైరెక్షన్ బాగాలేదని కొంతమంది అభిమానులు నిరాశ చెందారు. డైరెక్టర్ శంకర్ దర్శకత్వం అసలు బాగోలేదని సీరియస్ అయ్యారు. మెగా ఫ్యాన్స్ సైతం ఈ సినిమా బాగోలేదని అంటున్నారు. అయినాప్పటికీ గేమ్ చేంజర్ సినిమా మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ అందుకుంది. నిన్న కూడా బాగానే కలెక్షన్స్ వచ్చాయి.


అయితే సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కావడంతో పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఓవైపు పండగ, మరోవైపు అందరికీ సెలవులు ఉన్న నేపథ్యంలో సినిమా చూడడానికి ఫ్యామిలీ ఆడియన్స్, యూత్ ఎక్కువగా ఆసక్తిని చూపిస్తారు. కాగా, గేమ్ చేంజర్ సినిమా కలెక్షన్లపై దర్శకుడు ఆర్జీవి సెటైర్లు పేల్చారు. ఒకవేళ GC మొదటిరోజు రూ. 186 కోట్లు వసూలు చేస్తే... పుష్ప-2 రూ. 1,806 కోట్ల కలెక్షన్లు రావాల్సిందని అన్నారు.


గేమ్ చేంజర్ కు రూ. 450 కోట్లు ఖర్చు అయితే అద్భుతమైన విజువల్స్ ఉన్న ఆర్ఆర్ఆర్ సినిమాకు రూ. 4,500 కోట్లు ఖర్చు అయి ఉండాల్సింది అని అన్నారు. గేమ్ చేంజర్ సినిమా విషయంలో అబద్ధాలు నమ్మదగినవిగా ఉండాలని ఆర్జీవి పేర్కొన్నారు. అయితే వీటి వెనక దిల్ రాజు ఉండరని నమ్ముతున్నట్లు ఆర్జీవి రాసుకోచ్చారు. ఆర్జీవి చేసిన ఈ కామెంట్లపై మెగా అభిమానులు సీరియస్ అవుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: