ప్రస్తుతం సోషల్ మీడియా వల్ల చాలా సినిమాలకు దెబ్బ పడుతోందని చెప్పవచ్చు. ఆన్లైన్ వార్ కూడా వీటి వల్లే జరుగుతోంది. ఒకప్పుడు అభిమానులు తమ హీరోని ఎక్కువగా ఆదరించేవారు.ఇప్పుడు తమ హీరో సినిమా విడుదల అవుతుందంటే చాలు ఆ సినిమాను భుజాల మీద మోయడం వాటిని హిట్ చేయడం వంతుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా చేయడానికి అవతలి హీరోలను దూషించడం , కించపరచడం వంటివి చేస్తూ ఉన్నారు వీటివల్ల సినిమా వాళ్ళ మీద నెగెటివిటీ ఎక్కువగా స్ప్రెడ్ అయ్యి ఫ్లాప్ చేయడానికి చాలా కృషి చేస్తున్నారు అభిమానులు.


రోజురోజుకి ఒక హీరోల అభిమానులు మరొక హీరోలను  నెగిటివ్ చేయడమే రోజురోజుకి పెరుగుతూ ఉన్నది. అలా ఇటీవల సంక్రాంతికి విడుదలైన గేమ్ ఛేంజర్ సినిమా మీద తీవ్రస్థాయిలో జరుగుతున్న విష ప్రచారం వల్ల ఇది చాలా ప్రమాదంగా మారిపోయింది. యూఎస్ఏ లో ఈ సినిమాకు సంబంధించి షోలు పూర్తయ్యాయో లేదో అప్పుడే డిజాస్టర్ అంటూ కూడా కొన్ని సోషల్ మీడియా హ్యాష్ ట్యాగ్ కొంతమంది వైరల్ గా చేశారు. అంతేకాకుండా మొదటి రోజు కలెక్షన్స్ పోస్టర్లు కూడా బయటికి రాగానే అవి ఫేక్ కలెక్షన్స్ అన్నట్టుగా మారిపోయాయి.


ప్రధానంగా జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ గేమ్ ఛేంజర్ చిత్రానికి సంబంధించి ఫ్యాన్స్ ఎక్కువగా నెగటివ్ ని స్ప్రెడ్ చేస్తున్నారు.ఎందుకంటే గతంలో ఈ అభిమానులు కూడా ఈ హీరోల సినిమాలు విడుదలైనప్పుడు ఇలాంటి పనిచేయడంతో కాస్త కోపంగా ఉన్నారు. పుష్ప 2 విషయంలో నానా హంగామా చేశారు.. ఎన్టీఆర్ దేవర సినిమా విషయంలో కూడా ఇలాంటి పనిచేయడంతో  ఇప్పుడు రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా పైన వ్యతిరేకత నెలకొన్నిపేలా చేశారు. దీంతో ఇప్పుడు గేమ్ ఛేంజర్ సినిమా పైన ఎన్టీఆర్ తారక్ ఫ్యాన్సీ సైతం బదులు తీర్చుకున్నారు అనే విధంగా కామెంట్స్ వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: