సౌత్ లేడీ సూపర్ స్టార్ అయినటువంటి నయనతార విజ్ఞేష్ శివన్ ని పెళ్లి చేసుకుని వైవాహిక జీవితాన్ని చాలా అద్భుతంగా ముందుకు కొనసాగిస్తుంది. ఇక ఈ జంటకి ఇద్దర కవల పిల్లలు కూడా ఉన్నారు. ఓవైపు పిల్లల బాధ్యతలు చూస్తూనే మరోవైపు సినిమాలు కూడా చేస్తుంది. అలా ఈ ఏడాది నయనతార నటించిన ఎన్నో సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇక ఓవైపు సినిమాల్లో చేస్తూనే మరోవైపు వివాదాల్లో కూడా ఎక్కువగా ఉంటుంది.నయనతార బియాండ్ ది ఫెయిరీ టెయిల్ అనే డాక్యుమెంటరీలో ధనుష్ మూవీకి సంబంధించిన క్లిప్ ని వాడుకోవడం వల్ల ధనుష్ ఆమె డాక్యుమెంటరీ పై పదికోట్ల పరువు నష్ట దావా వేశారు. ప్రస్తుత ఈ కేసు ఇంకా కోర్టులో నడుస్తోంది.ఈ విషయం పక్కన పెడితే..నయనతార పెళ్లి విషయంలో ఇప్పటికే ఎన్నో రూమర్లు వినిపించాయి. 

గతంలో నయనతార ఇండియన్ మైఖేల్ జాక్సన్ అయినటువంటి ప్రభుదేవా, నటుడు శింబుని కూడా పెళ్లి చేసుకోవాలనుకున్నట్లు వార్తలు వినిపించాయి... ప్రభుదేవతో అయితే నయనతార పెళ్లి వరకు వెళ్లింది. పబ్లిక్ గా ఇద్దరు ఎన్నో ఈవెంట్లలో కలిసి తిరిగారు.అలాగే నయనతారను పెళ్లి చేసుకోవడం కోసం ప్రభుదేవా తన మొదటి భార్యకు విడాకులు కూడా ఇచ్చేశాడు.కానీ చివరికి వీరి పెళ్లి పీటల వరకు వెళ్లకుండానే ఆగిపోయింది. అయితే నయనతార శింబు ప్రభుదేవాలతోనే కాకుండా నటుడు ఆర్యాతో కూడా ప్రేమాయణం నడిపిందని,వీరిద్దరికి సంబంధించిన పెళ్లి కార్డు కూడా ప్రస్తుతం నెట్టింట్లో లీక్ అవుతుంది. మరి ముహూర్తం కూడా పెట్టుకొని ఈ జంట ఎందుకు పెళ్లి చేసుకోలేదు అనేది ఇప్పుడు చూద్దాం.. నయనతార నటుడు ఆర్య కాంబినేషన్లో కొన్ని సినిమాలు వచ్చాయి.

అందులో బాగా హీట్ అయిన సినిమా అట్లీ దర్శకత్వంలో వచ్చిన రాజారాణి. ఈ సినిమాలో ఆర్యా, నయనతార, జై, నజ్రియా నజీమ్ ల నటనకి చాలామంది ఫిదా అయ్యారు. అయితే గతంలో నయనతార ఆర్య ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారని దానికి ఇదే సాక్ష్యం అంటూ ఒక పెళ్లి కార్డు వైరల్ అవుతుంది. అయితే ఈ పెళ్లి కార్డు చూసి చాలా మంది నిజంగానే వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారా అని కామెంట్స్ పెడుతున్నారు జనాలు.కానీ ఇందులో అస్సలు నిజం లేదు.. ఎందుకంటే నయనతార ఆర్యాలు ప్రేమించుకోలేదు. వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్.అయితే వీరి పెళ్లి కార్డు అంటూ వైరల్ అవుతున్న కార్డు వీరిద్దరూ కలిసి నటించినా రాజారాణి సినిమా లోనిది. కానీ దీన్ని వైరల్ చేస్తూ వీరిద్దరూ నిజంగానే పెళ్లి చేసుకోవాలనుకున్నారని ముహూర్తం కూడా పెట్టుకొని విడిపోయారంటూ రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: