కన్నడ నటుడు కిచ్చా సుదీప్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఈయన దర్శకుడిగా, నిర్మాతగా, సినీ రచయితగా, టీవీ వ్యాఖ్యాతగా కూడా గొప్ప గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ స్టార్ హీరో సుదీప్ కన్నడతో పాటుగా తెలుగు సినిమాల్లో కూడా నటించాడు. ఈయన ఈగ సినిమాలో ప్రతినాయక పాత్రలో నటించాడు. ఆయన నటనతో ఎంతో మంది తెలుగు ప్రేక్షకులకు తన వైపుకి తిప్పుకున్నాడు.
ఈయన కన్నడంలో హుచ్చా, నంది, స్వాతి ముత్తు సినిమాలకు వరుసగా మూడు సంవత్సరాలు ఫిలిం ఫేర్ పురస్కారాలు అందుకున్నాడు. వాటితో పాటు సుదీప్ 2013 నుంచి కన్నడ బిగ్ బాస్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. ఇలా కిచ్చా సుదీప్ అన్నీ రంగాలలో ఆయన ప్రతిభను చాటుకుంటున్నాడు. ఇక ఇప్పుడు కిచ్చా సుదీప్ వరుస సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు. ఈగ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సుదీప్ కిచ్చా మూవీతో కిచ్చా సుదీప్ అని పేరు తెచ్చుకున్నాడు.
ఇదిలా ఉండగా కిచ్చా సుదీప్ నటించిన మాక్స్ మూవీ థియేటర్ లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను ఇంకా అలిసిపోలేదని చెప్పుకొచ్చాడు. కానీ ఎదో ఒక సమయంలో పక్కా రిటైర్ అవుతానని తెలిపారు. ప్రతి హీరో ఏదో ఒక సమయంలో బోర్‌ కొట్టేస్తాడని ఆయన స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరికీ ఒక టైమ్‌ అనేది ఉంటుందని అన్నారు. ఇన్నేళ్ల తన కెరీర్‌లో ఒక హీరోగా తానేప్పుడూ సెట్‌లో ఎవరినీ వెయిట్‌ చేయించలేదని తెలిపారు. భవిష్యత్తులో సపోర్టింగ్‌ రోల్‌లో నటించినప్పటికి.. ఇంకొకరి కోసం ఎదురుచూస్తూ ఆయన కూర్చోరాని చెప్పుకొచ్చాడు. సోదరుడు, మామయ్య వంటి పాత్రలు చేయడానికి తనకు ఆసక్తి లేదు అని అన్నారు.
అలాగే తాను నటనకు విరామం తీసుకొనని స్పష్టం చేశారు. సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యే ప్రసక్తే లేదని.. ఒకవేళ ప్రధాన పాత్ర అవకాశాలు రాకపోతే దర్శకత్వం, ప్రొడక్షన్‌ వైపు తాను వెళ్తానని తెలిపారు. ఇక కిచ్చా సుదీప్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: