టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం చిత్రం రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకు డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ముఖ్యంగా ఇలాంటి సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిరుత్సాహ పడానివ్వవు. తనదైన శైలిలో సినిమాలు తీస్తూ అనిల్ రావిపూడి ఫ్యామిలీ డైరెక్టర్ గా నిలిచారు. నేడు గ్రాండ్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో హీరోయిన్లు గా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకు భీమ్స్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. 18 ఏళ్ల తర్వాత విక్టరీ వెంకటేష్, రమణ గోగుల కాంబో మళ్లీ వచ్చిన సినిమా ఇది. బ్లాక్‌బస్టర్ లక్ష్మి కోసం వెంకటేష్‌తో కలిసి పని చేసిన రమణ గోగుల ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫస్ట్ సింగిల్‌కి తన వాయిస్ ని అందించారు.
ఇక తాజాగా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం మరో బ్లాక్ బస్టర్ గా నిలవనుంది. ఈ సందర్భంగా అనిల్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆయన మాట్లాడుతూ.. 'నేను సినిమా చేసే హీరోకి ఉన్న మార్కెట్ ఏంటి..? ఆ హీరోతో సినిమా చేసేటప్పుడు బడ్జెట్ ఎంతలోపు చేయాలి.. రిలీజ్ చేసే టైమ్‌కి నిర్మాత ఎంత సేఫ్‌లో ఉండాలి అనేది ఫస్ట్ నేను చూసుకుంటాను. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ఇది బిజినెస్. కేవలం క్రేజ్ ఒక్కటి సరిపోదు. డబ్బు ఎవరైనా సరే కష్టపడి సంపాదిస్తారు. కనుక వాళ్ల డబ్బుతో నువ్వు గేమ్ ఆడకూడదు. నీ డబ్బుతో నువ్వు ఆడుకోవచ్చు కానీ వేరే వాళ్ల డబ్బుతో ఆడుతున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది నా అభిప్రాయం.. అందుకే నేను ఎప్పుడూ బడ్జెట్‌ని దాటి సినిమా తీయను. నాకు అనిపిస్తుంది.. నేను అద్భుతంగా ఖర్చు పెట్టి, మేకింగ్, విజువల్స్ తీయొచ్చు కదా అని కానీ ప్రాజెక్టుకి సరిపడే చేస్తాను' అంటూ అనిల్ రావిపూడి అన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: