స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. సంక్రాంతి పండుగ సందర్భంగా నేడు 'సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా గ్రాండ్ రిలీజ్‌ అయ్యింది. ఈ సినిమాలో హీరోయిన్లు గా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ నటించారు. ఈ సినిమాకు డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఇప్పటికే ప్రమోషన్ లో దుమ్ము లేపిన ఈ చిత్రం.. ఇప్పుడు రిలీజ్ అయ్యి కూడా దుమ్ము లేపుతుంది.  ఈ సినిమాకు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు భీమ్స్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. 18 ఏళ్ల తర్వాత విక్టరీ వెంకటేష్, రమణ గోగుల కాంబో మళ్లీ వచ్చిన సినిమా ఇది. బ్లాక్‌బస్టర్ లక్ష్మి కోసం వెంకటేష్‌తో కలిసి పని చేసిన రమణ గోగుల ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫస్ట్ సింగిల్‌కి తన వాయిస్ ని అందించారు. అయితే వెంకీ మామ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా స్టోరీ లైన్ కూడా చాలా కొత్తగా ఉంది.
ఇదిలా ఉండగా.. ఈ సినిమా సంక్రాంతి హిట్ అవ్వబోతునట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే  సినిమా చూసిన వాళ్లు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని షేర్ చేస్తున్నారు. సినిమా క్రైమ్ జోనర్లో స్టార్ట్ అవుతుందట. ఆ తర్వాత ఫ్యామిలీ ఎలిమెంట్స్ వైపు టర్న్ తీసుకుందట. ఇంటర్వెల్ బ్లాక్ వరకు ఎంటర్టైన్మెంట్ బాగుందని సమాచారం. అటు తర్వాత వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ వంటివి ఇంట్రెస్టింగ్ గా సాగుతాయట. క్లైమాక్స్ కూడా హిలేరియస్ గా యాక్షన్ ఎలిమెంట్స్ తో డిజైన్ చేసినట్టు తెలుపుతున్నారు. ఈ సినిమా మెయిన్ టార్గెట్ ఫ్యామిలీ ఆడియన్సే అని.. తప్పకుండా వాళ్లకు ఈ సినిమా నచ్చుతుందని అంటున్నారు. ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమా హ్యాట్రిక్ కొట్టేసినట్టే అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: