గ్లామరస్ బ్యూటీ ఈషా రెబ్బా మంచి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగు చిత్రాలలో ఈమె ఎక్కువగా పని చేస్తుంది. అంతక ముందు ఆ తర్వాత, బండిపోటు, అమీ తుమీ మరియు విస్మయం చిత్రాలలో ఆమె ప్రసిద్ధి చెందింది. ఈషా రెబ్బా వరంగల్ లో తెలుగు మాట్లాడే కుటుంబంలో జన్మించింది. కానీ ఈమె హైదరాబాద్‌లో పెరిగారు. హీరోయిన ఈషా రెబ్బా MBA పూర్తి చేసింది. రెబ్బా కాలేజీ సమయంలో మోడల్‌గా కూడా పనిచేసింది. ఆ తర్వాత దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి నుండి ఆమెకు ఆడిషన్ కాల్ వచ్చింది. ఇక ఈమె 2012లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావు అని చాలా మంది అంటూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం వచ్చిన సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న అతి తక్కువమంది తెలుగమ్మాయిలలో ఈషా రెబ్బ ఒకరు.
ఈమె చిన్న హీరోలతో నటించింది. అలాగే పెద్ద స్టార్ హీరోల సినిమాల్లో కూడా సెకండ్ హీరోయిన్ గా కనిపించింది. ఎన్టీఆర్ హీరోగా నటించిన అరవింద సమేత సినిమాలో ఈ అమ్మడు సెకండ్ హీరోయిన్ గా తన నటనతో ఆకట్టుకుంది. కానీ ఈ భామకి ఇంతవరకు మంచి అవకాశాలు రాలేదు. ఆ తర్వాత ఈ అమ్మడు.. ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పై సందడి చేసింది. వెబ్ సిరీస్ చేస్తూ ఉంది. కానీ ఆ రోజు తాను నటన జీవితానికి బ్రేక్ ఇవ్వలేదు. ఇక తాజాగా ఈ అందాల ముద్దుగుమ్మ సోషల్ మీడియా వేదికగా తన ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలలో ఈ బ్యూటీ వైట్ కలర్ డ్రెస్స్ వేసుకొని ఉంది. తన అందాన్ని చూసిన కుర్రాళ్లు.. ఎక్స్ వేదికగా కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. మరికొందరు మాత్రం అందచందాలు, ఆకట్టుకునే నటన ఉన్న ఎందుకో ఈ అమ్మడికి అంతగా ఛాన్స్ లు రావడం లేదని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: