నందమూరి నటసింహం బాలకృష్ణ నుంచి తాజాగా వచ్చిన మూవీ డాకు మహారాజ్. మాస్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా సంక్రాంతి బరిలో జనవరి 12న రిలీజ్ అయింది.ఇక సంక్రాంతి బాలయ్య ఎంత సెంటిమెంట్ ఫెస్టివల్లో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఏడాది సంక్రాంతికి వచ్చిన బాలయ్య బొమ్మ బ్లాక్ బాస్టర్ పక్కా. అదే సెంటిమెంట్ ఇప్పుడు వర్క్ అవుతుంది. బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ ఖుషితో సంక్రాంతి పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సినిమాకు హిట్ టాక్ రావడం భారీ అంచనాలతో థియేటర్లో రిలీజ్ అయిన ఈ సినిమాకు ఓపెనింగ్స్ కూడా అదే రేంజ్‌లో రావడం తో అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఈ క్రమంలోనే సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ రేంజ్ లో వచ్చాయో తెలుసుకోవాలని ఆసక్తి అందరిలోనూ మొదలైంది.సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై సంయుక్తంగా సూర్యదేవర నాగవంశీ, శ్రీ సాయి సౌజన్యలు నిర్మించిన ఈ సినిమా రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తోనే తెరకెక్కించారు. ఇందులో బాలయ్య హీరోగా ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్గా చాందిని చౌదరి, హర్షవర్ధన్, హిమజ, బాబి డియోల్‌, ఊర్వశి రౌతెలా తదితరులు కీలకపాత్రలో నటించి మెప్పించారు. ఇక సినిమాకు థమన్‌ బాక్గ్రౌండ్ స్కోర్ హైలెట్గా నిలిచింది. అఖండ నుంచి బాలయ్య వరుస హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ఇలాంటి క్రమంలో సినిమా అంచనాలను అందుకుందా లేదా ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. భారీ లెవెల్‌లో జరుపుకున్న ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.67.30 కోట్ల బిజినెస్ జరిపింది.

అలాగే ప్రపంచవ్యాప్తంగా రూ.170 కోట్ల టార్గెట్‌తో సినిమా రిలీజ్ అయింది.ఈ క్రమంలో ఈ సినిమా మొదటి రోజు 30 కోట్లు కలెక్షన్స్ సాధించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . ఇది బాలయ్య కెరియర్ లోనే హైయెస్ట్ రికార్డ్స్ .ఇప్పటి వరకు బాలయ్య నటించిన అన్ని సినిమాలల్లోకి ఈ మూవీ నే తోపు.ఇదే మూమెంట్లో బాలయ్య కెరియర్ లోని అత్యధికంగా మొదటి రోజు కలెక్షన్స్ సాధించిన టాప్ ఫైవ్ మూవీ వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి . కాగ గోపీచంద్ మల్లినేని దర్శకత్వంలో బాలయ్య నటించిన వీర సింహారెడ్డి ఆయన కెరియర్ లోనే ఫస్ట్ డే హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీగా ఇప్పటి వరకు చరిత్రలో నిలిచిపోయింది . మొదటి రోజు 25.35 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక అఖండ సినిమా మొదటి రోజు 15.39 కోట్లు షేర్ వసుళ్లు చేసింది . ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య నటించిన "భగవంత్ కేసరి" సినిమా మొదటి రోజు 14.36 కోట్లు షేర్ చేసింది. ఎన్టీఆర్ బయోపిక్గా తెరకెక్కిన 'ఎన్టీఆర్ కథానాయకుడు' సినిమా 7.5 కోట్లు షేర్ వసూళ్లు చేసింది . అయితే బాలకృష్ణ సినీ కెరియర్ లో ఇప్పటివరకు హైయెస్ట్ ఓపెనింగ్స్ ఈ నాలుగు సినిమాలే టాప్ ప్లేస్ లో ఉన్నాయి . ఇప్పుడు ఆ ప్లేస్ లోకి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ వచ్చి చేరింది. ఫస్ట్ డే మొత్తంగా 30 కోట్లు కలెక్ట్ చేసి బాలయ్య చిర కాల కోరిక తీర్చేసింది.దీంతో బాలకృష్ణ కెరీర్‌లో అత్యంత అధిక వసూళ్లు సాధించిన చిత్రాల లిస్టులో డాకు మహారాజ్ చేరింది.

మరింత సమాచారం తెలుసుకోండి: