తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది దర్శకులు తాము దర్శకత్వం వహించిన సినిమాలను సంక్రాంతి పండక్కు విడుదల చేయాలి అని భావిస్తూ ఉంటారు. అందుకు ప్రధాన కారణం సంక్రాంతి పండక్కు విడుదల అయ్యే సినిమాలకు మంచి ఓపెనింగ్స్ వస్తూ ఉంటాయి. అలాగే సినిమా బాగున్నట్లయితే అద్భుతమైన కలెక్షన్లు కూడా వస్తూ ఉంటాయి. దానితో చాలా మంది దర్శకులు తమ సినిమాలను సంక్రాంతి పండక్కు స్పెషల్ గా విడుదల చేస్తూ ఉంటారు. ఇకపోతే సంక్రాంతి పండుగకు తమ సినిమాలను తీసుకువచ్చి అద్భుతమైన విజయాలను అందుకున్న దర్శకులు ఎంతో మంది ఉన్నారు.

ఇకపోతే ఈ సంవత్సరం సంక్రాంతి పండక్కు చాలా సినిమాలే విడుదల అయ్యాయి. అందులో భాగంగా జనవరి 12 వ తేదీన బాబి దర్శకత్వంలో రూపొందిన డాకు మహారాజ్ సినిమా విడుదల కాగా , ఈ రోజు అనగా జనవరి 14 వ తేదీన అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా విడుదల అయింది. ఈ రెండు సినిమాలకు కూడా ప్రేక్షకుల నుండి అద్భుతమైన పాజిటివ్ టాక్ వచ్చింది. ఇకపోతే గతంలో కూడా ఈ ఇద్దరు దర్శకులు తాము దర్శకత్వం వహించిన సినిమాలను సంక్రాంతి పండుగకు విడుదల చేసి మంచి విజయాలను అందుకున్నారు. 2023 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా బాబీ దర్శకత్వంలో రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది.

ఇక 2019 వ సంవత్సరం సంక్రాంతి పండక్కి అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఎఫ్ 2 , ఆ తర్వాత సంవత్సరం సంక్రాంతి పండక్కు సరిలేరు నీకెవ్వరు సినిమాలు విడుదల అయ్యాయి. ఈ రెండు సినిమాలు కూడా అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. ఇలా ఈ ఇద్దరు దర్శకులు ఇప్పటికే సంక్రాంతికి తమ సినిమాలను తీసుకువచ్చి మంచి విజయాలు అందుకున్నారు. ఈ సంవత్సరం ఆ సెంటిమెంట్ ను అలాగే కంటిన్యూ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: